Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న చిత్రం 'పెళ్లి సందడి'. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను ఆయన శిష్యురాలు గౌరి రోణంకి డైరెక్ట్ చేస్తున్నారు.
ఆర్కా మీడియా వర్క్స్, ఆర్.కె ఫిలిం అసోసియేట్స్ బ్యానర్స్‌పై కె.కష్ణ మోహన్‌రావు సమర్పణలో మాధవి కోవెలమూడి,
శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాల రూపకల్పనలో తన మ్యాజిక్‌ని చూపిన రాఘవేంద్రరావు ఈ సినిమాలో అతిథి పాత్రలో నటించడం విశేషం. ఈ చిత్రం నుంచి 'మధురానగరిలో యమునా తటిలో...' అనే లిరికల్ పాటను అగ్రకథానాయకుడు రవితేజ విడుదల చేసి, సినిమా పెద్ద హిట్ కావాలని
చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు.
'మధురా నగరిలో, మయునా తటిలో.. మురళీ స్వరములే ముసిరిన ఎదలో..' అంటూ రెండు వేరియేషన్స్‌లో సాగే ఈ పాటను చంద్రబోస్ రాశారు. ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని సమకూర్చిన ఈ పాటను శ్రీనిధి, నయనానాయర్, కాల భైరవ పాడారు. ఈ పాటకు విశేష స్పందన లభిస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం మాట్లాడుతూ,'శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీలీల జంటగా రూపొందిన ఈ చిత్రంపై ఇప్పటికే అందరిలోనూ మంచి అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు మించి ఈ సినిమా ఉంటుంది. అలాగే ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలకు చాలా మంచి స్పందన వచ్చింది. అలాగే టీజర్, రీసెంట్గా అగ్ర కథానాయకుడు మహేష్ రిలీజ్ చేసిన ట్రైలర్‌కు కూడా అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా 'మధురానగరిలో..' లిరికల్ సాంగ్ కూడా శ్రోతల్ని విశేషంగా అలరిస్తోంది. దర్శకేంద్రుడి మ్యాజిక్ మరోమారు రిపీట్ అయ్యేలా ఈ సినిమా కచ్చితంగా మంచి విజయం సాధిస్తుంది. దసరా సందర్భంగా ఈచిత్రాన్ని విడుదల చేస్తున్నారు' అని చెప్పారు.
ప్రకాశ్‌రాజ్, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, తనికెళ్ల భరణి, పోసాని కష్ణ మురళి, వెన్నెల కిషోర్, సత్యంరాజేష్, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ రెడ్డి, శకలక శంకర్, అన్నపూర్ణ, జాన్సి, ప్రగతి, హేమ, కౌముది, భద్రం, కిరీటి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి, సాహిత్యం: శివశక్తి దత్త, చంద్రబోస్, సినిమాటోగ్రఫి: సునీల్ కుమార్ నామ, ఎడిటర్: తమ్మిరాజు, ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నె, మాటలు: శ్రీధర్ సీపాన, ఫైట్స్: వెంకట్, కొరియోగ్రఫి: శేఖర్ వీజే, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాయిబాబా కోవెలమూడి, సమర్పణ: కె. కష్ణమోహన్ రావు, నిర్మాతలు: మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, దర్శకత్వం: గౌరీ రోణంకి.