Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ('మా') ఎన్నికల పోలింగ్ తేదీ
అక్టోబర్ 10న ఫిక్స్ అవడంతో ఇప్పటికే అధ్యక్ష పదవులకు పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణు తమ ప్యానల్ సభ్యుల్ని ప్రకటించారు. అలాగే ఇరువురు నామినేషన్స్‌ని దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ బుధవారం విష్ణు ప్యానెల్ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ, 'మా సభ్యులను ప్రకాష్ రాజ్ తప్పుదోవ పట్టిస్తున్నారు. అబద్దాలు చెబుతున్నారు. 'మా'లో క్షుద్ర రాజకీయం చేయవద్దు. అవకాశాలు ఇప్పించేందుకే 'మా' ఉంది. కరోనాలో కళాకారులు ఇబ్బందులు పడ్డప్పుడు 'మా' ఉప్పులూ, పప్పులిచ్చింది. 300 పైగా ఆసుపత్రులతో 'మా'కు అసోషియేషన్ ఉంది. వీటిని మరచి, ప్రకాష్‌రాజ్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఆయన ఒక్కసారైనా 'మా' ఎన్నికల్లో ఓటేశారా ..?, ఒక్క మా మీటింగ్‌కు అటెండ్ అయ్యారా .? ఎన్నిసార్లు 'మా'నుండి సస్పెండ్ అయ్యారో చెప్పాలి?. సరైనోడు లేడు కాబట్టి వచ్చానని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు చేయటం సబబు కాదు. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమలో ఉన్న గొప్ప నటులు ఉన్నారు. వీరు తెలియదా ? 'మా'కు ప్రెసిడెంట్‌గా తెలుగోడే ఉండాలి. మెంబర్‌గా ఉండొచ్చు. కానీ గెస్ట్ మాత్రమే. 'మా' మసక బారిందని కొందరు కామెంట్ చేసినప్పుడు, మసక బారలేదు అని చెప్పాను. నేను వెల్ ఫేర్ కమిటీ చైర్మన్‌గా ఉన్నప్పుడు ఆరు నెలల పాటు సర్వే చేశాను. అవకాశాలు, పదవి వ్యామోహాలతో 'మా' లో ఉండలేదు. మంచిని మైక్‌లో చెప్పండి, చెడుని చెవిలో చెప్పండి అని పెద్దలు చెప్పిన మాటలతో నా నోటికి తాళం వేసి కూర్చున్నాను. 11 మంది మీడియా ముందుకు వెళ్ళి జరగనిది, చెయ్యలేనివి చెప్పారు. కరోనా టైంలో 'మా' శాయశక్తులా సభ్యులకు సేవ చేసింది. రెండు సంవత్సరాలు ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా పనులు చేసాం.
ఈ మూడు ఏళ్లలో 'మా' ముందుకు పోయింది.. కానీ మసక బారలేదు. విష్ణుకి, ఆయన ప్యానెల్‌కి నా పూర్తి మద్దతు ఉంటుంది' అని చెప్పారు.