Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''లవ్ స్టోరి' ఒక క్లాసిక్ ఫిల్మ్. ఇలాంటివి అరుదుగా వస్తుంటాయి. ఈ సినిమాలో చైతూ నటన చూశాక సంతోషమేసింది. యాక్టర్, స్టార్ ఇవి రెండు డిఫరెంట్ పదాలు. చైతూను ఒక స్టార్ యాక్టర్‌గా శేఖర్ కమ్ముల తయారు చేశారు. న్యూ జర్నీలోకి తీసుకెళ్లారు' అని అగ్ర కథానాయకుడు నాగార్జున అన్నారు.
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించిన చిత్రం 'లవ్‌స్టోరి'. ఈ సినిమా ఇటీవల విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో నాగార్జున మాట్లాడుతూ,''ప్రేమనగర్' రిలీజై 50 ఏళ్లవుతోంది. సేమ్ డేట్‌కు 'లవ్ స్టోరి' రిలీజ్ అయ్యింది. 'ప్రేమనగర్' టైమ్ లోనూ తుపాన్, సైక్లోన్ ఉన్నా, నాన్నగారి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. తుఫాన్, కొవిడ్, సైక్లోన్‌తో పోరాడి 'లవ్ స్టోరి' గొప్ప విజయాన్ని సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎప్పుడూ మమ్మల్ని మంచి చూపుతో చూశాయి. తెలుగు ప్రేక్షకులు సినిమాని ప్రేమిస్తారు' అని చెప్పారు.
నిర్మాత నారాయణ దాస్ నారంగ్ మాట్లాడుతూ, 'ఈ సినిమా అద్భుతంగా ప్రదర్శితం అవుతోంది. ఈ సినిమా సక్సెస్ కావడం టాలీవుడ్‌కు శుభ పరిణామం. ఇప్పుడు చాలా సినిమాలు మా సినిమా సక్సెస్ చూసి, రిలీజ్ డేట్స్ కన్ఫర్మ్ చేసుకుంటున్నాయి' అని చెప్పారు. 'ఈ సినిమా సాధించిన విజయం నాకు చాలా రిలీవ్ ఇచ్చింది. జనరల్‌గా నా సినిమాల సక్సెస్ గురించి టెన్షన్ పడను. కానీ ఈ సినిమా విజయం సాధించాలని గట్టిగా కోరుకున్నా. రెండు సెన్సిటివ్ ఇష్యూస్ గురించి సినిమాలో చెప్పాం. మరో ఛాలెంజింగ్ విషయం పాండమిక్ టైమ్‌లో థియేటర్లకు జనం వస్తారా? రారా? అని భయపడ్డాం. ఆ భయాలన్నీ జయించి విజయం సాధించాం' అని దర్శకుడు శేఖర్‌కమ్ముల అన్నారు.
హీరోయిన్ సాయి పల్లవి మాట్లాడుతూ, 'థియేటర్లో సినిమా చూసి, ఎంజారు చేసి చాలా రోజులైంది. 'లవ్ స్టోరి' తో మళ్లీ సినిమాని థియేటర్లలో ఆస్వాదిస్తున్నాం' అని చెప్పారు. 'తెలుగు సినిమా ఆడియెన్స్ చిత్రాలను ఆదరించినట్లు దేశంలో ఇంకెక్కడా ఆదరించలేదు. దర్శకుడు శేఖర్ కమ్ముల గారి కంటెంట్, ఆయనకున్న గుడ్ విల్ ఎంత ఉందో ఇవాళ 'లవ్ స్టోరి' సక్సెస్ చూపిస్తోంది' అని హీరో నాగచైతన్య తెలిపారు.