Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'పుష్ప' చిత్రానికి సంబంధించి విడుదలవుతున్న క్యారెక్టర్ పోస్టర్స్ అందరిలోనూ క్యూరియాసిటీని రైజ్ చేస్తున్నాయి. ఇప్పటికే రగ్డ్ లుక్‌తో ఉన్న అల్లుఅర్జున్‌ని 'పుష్పరాజ్'గా, గుండుతో భిన్న గెటప్‌లో ఉన్న భన్వర్‌సింగ్ షెకావత్‌గా ఫహాద్ ఫాజిల్ క్యారెక్టర్ లుక్స్‌ని రిలీజ్ చేసిన చిత్ర బృందం తాజాగా కథానాయిక రష్మిక మందన్నా క్యారెక్టర్ లుక్‌ని విడుదల చేసింది. ఇందులో పుష్ప రాజ్ ప్రేయసి శ్రీవల్లిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రష్మిక లుక్ అందర్నీ విశేషంగా అలరిస్తోంది.
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'పుష్ప'. 'ఆర్య', 'ఆర్య 2' సినిమాల తర్వాత హ్యాట్రిక్ చిత్రంగా ఈ సినిమా రాబోతోంది. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈచిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో మొదటి భాగం 'పుష్ప: ది రైజ్' క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది.
శ్రీవల్లిగా రష్మిక క్యారెక్టర్ పోస్టర్‌కి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం మాట్లాడుతూ, 'ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీ అప్డేట్ కూడా సోషల్ మీడియాలో సంచలనం రేపింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, 'దాక్కో దాక్కో మేక..' పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా జాతీయ అవార్డు గ్రహీత, మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన హీరోయిన్ రష్మిక మందన్న ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన లభించింది. శ్రీవల్లి పాత్రలో రష్మిక పూర్తిగా డీ గ్లామర్ లుక్‌లో కనిపించడం అందర్నీ సర్ప్రైజ్ చేస్తోంది. పుష్పరాజ్ ప్రేయసిగా శ్రీవల్లి క్యారెక్టర్ ఎలా ఉండబోతోందనే ఆసక్తి కూడా అందరిలో రేకెత్తుతోంది' అని చెప్పారు.
ధనుంజరు, సునీల్, రావు రమేష్, అజరు ఘోష్, అనసూయ భరద్వాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై రవిశంకర్, సినిమాటోగ్రాఫర్: మిరోస్లా క్యూబా బ్రోజెక్, సంగీతం: దేవి శ్రీ ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్: రామకష్ణ - మోనిక నిగొత్రే, సౌండ్ డిజైన్: రసూల్ పూకుట్టి, ఎడిటర్: కార్తిక శ్రీనివాస్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, పీటర్ హెయిన్, లిరిసిస్ట్: చంద్రబోస్.