Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వీనస్ మూవీస్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం 'వెల్లువ'. రంజిత్, సౌమ్య మీనన్ (కేరళ), అలీ, రావు రమేష్, నరేష్, ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మైల రామకష్ణ దర్శకత్వంలో ఎం.కుమార్, ఎం. శ్రీనివాసులు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని హైజాక్ బిస్ట్రోలో జరుగుతోంది. అలీ పై 'చెప్పకురా మామా నువ్వు చెప్పకు సారీ' అంటూ సాగే పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో అలీ ఈ చిత్ర టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ, 'ఈ సినిమాకు ఘంటాడి కష్ణ అద్భుతమైన పాటలు అందించారు. అలాగే నాతో 'చెప్పకురా మామా..' పాటని కూడా పాడించారు. హీరో, హీరోయిన్లు చాలా చక్కగా నటించారు. ఇది బ్యూటిఫుల్ మెసేజ్ ఉన్న కథ. ఈనెలలోనే ఈ సినిమా విడుదలకు దర్శక,నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు' అని చెప్పారు. 'లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో రూపొందుతున్న చిత్రమిది. ఘంటాడి కష్ణ సంగీతం, బాల్ రెడ్డి ఫోటోగ్రఫీ ఈ చిత్రానికి ప్లస్ అవుతాయి. హీరో రంజిత్, అలీతో చేసే ఈ పాటతో సినిమా పూర్తవుతుంది. ప్రేక్షకులందరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది' అని దర్శకుడు రామకష్ణ తెలిపారు.
హీరో రంజిత్ మాట్లాడుతూ, 'సీనియర్ నటులతో చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది' అని చెప్పారు. చిత్ర నిర్మాత ఎం శ్రీనివాసులు మాట్లాడుతూ, 'విద్యార్థి చివరి దశలో మనం జీవనోపాధిని ఏర్పాటు చేసుకుంటే, జీవితాంతం సంతోషంగా ఉంటాం. జాబ్ తర్వాతే లవ్, పెళ్లి అనే మంచి కాన్సెప్టుతో వస్తున్న సినిమా ఇది' అని అన్నారు. మరో నిర్మాత కుమార్ మాట్లాడుతూ, 'ఈ సినిమాలో మంచి కంటెంట్ ఉంది. సొసైటీకి ఇలాంటి మంచి సినిమా కావాలి. ఘంటాడి కష్ణ అందించిన పాటలను ప్రేక్షకులు అందరూ కచ్చితంగా ఎంజారు చేస్తారు. టెక్నీషియన్స్ సహకారంతో సినిమా బాగా వచ్చింది' అని చెప్పారు. 'టైటిల్‌కి తగ్గట్టుగానే ఈ సినిమాకు వెల్లువ లాంటి సంగీతం అందించాను. దర్శక, నిర్మాతల అభిరుచి కారణంగానే పాటలన్ని సందర్భానుసారంగా బాగా వచ్చాయి. నా కెరీర్లో ఈ సినిమా ఒక మైల్ స్టోన్‌గా నిలుస్తుంది' అని సంగీత దర్శకుడు ఘంటాడి కష్ణ అన్నారు.