Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రావణ్ వైజిటి, అనిల్ ఇనమడుగు, క్రిష్టెన్ రవళి, అపర్ణ హీరో, హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'తీరం'. అకి క్రియేటివ్ వర్క్స్, యల్.యస్. ప్రొడక్షన్స్ బ్యానర్లు పై ఎం.శ్రీనివాసులు నిర్మించారు. అనిల్ ఇనమడుగు దర్శకుడు. ఈ చిత్ర టీజర్‌ను హీరో శ్రీకాంత్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,'' తీరం' టీజర్ చాలా అద్భుతంగా ఉంది. మ్యూజికల్ లవ్ స్టోరీతో పాటు భావోద్వేగాల సమ్మేళనంగా సినిమా తీశారని తెలుస్తుంది. అనిల్ టేకింగ్ చాలా బాగుంది. కెమెరా వర్క్, మ్యూజిక్ సూపర్‌గా ఉన్నాయి. చిన్న సినిమా అయినప్పటికీ నిర్మాత శ్రీనివాసులు క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు' అని చెప్పారు. 'యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. సినిమా బాగా వచ్చింది. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం' అని హీరో, దర్శకుడు అనిల్ ఇనమడుగు అన్నారు. చిత్ర నిర్మాత ఎం. శ్రీనివాసులు మాట్లాడుతూ,' కొత్త వారైనా కూడా ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. సెన్సార్ పూర్తయ్యింది. ఈనెల 9న మా చిత్రాన్ని సినేటెరియా సంస్థ ద్వారా వెంకట్ గారు రిలీజ్ చేస్తున్నారు' అని చెప్పారు.
సినేటెరియా గ్రూప్ సంస్థ అధినేత వెంకట్ బోలేమోని మాట్లాడుతూ,' ఇదొక అద్భుతమైన ఎమోషనల్ ఎంటర్టైనర్. సినిమా చూశాను. శ్రీనివాసులు గారి మేకింగ్, అనిల్ టేకింగ్ బ్యూటిఫుల్. మ్యూజిక్ మెయిన్ హైలెట్‌గా నిలుస్తుంది. మా సినేటెరియా ద్వారా ఈ చిత్రాన్ని అత్యధిక థియేటర్స్‌లో భారీగా రిలీజ్ చేస్తున్నాం' అని తెలిపారు.