Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'నల్లమల' టీజర్ లాంచ్‌లో దర్శకుడు దేవాకట్టా
అమిత్ తివారీ, భానుశ్రీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'నల్లమల'. ఈ చిత్రం ద్వారా రవి చరణ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆర్.ఎమ్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను దర్శకుడు దేవా కట్టా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దేవాకట్టా మాట్లాడుతూ,'ఇందులోని 'ఏమున్నావే పిల్ల..' లాంటి పాట నాకు ఒక్కటీ కూడా లేదు అని అసూయ పడ్డాను. పి.ఆర్. అత్యద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అమిత్, అజరు ఘోష్ వంటి మంచి క్యాస్టింగ్‌ను పెట్టుకోవడంతోనే ఈ సినిమా సక్సెస్‌కు మొదటి మెట్టు పడిందని భావిస్తున్నా. ఇప్పటికే ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ బాగున్నాయి. ఈ సినిమా వండర్స్ క్రియేట్ చేస్తుందని నమ్ముతున్నా' అని చెప్పారు.
'దర్శకుడు దేవాకట్టా మా టీజర్‌ని లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమాకు అన్నీ మా దర్శకుడు రవి చరణ్ గారే. ఆయన ఎంత కష్టపడ్డారో కళ్లారా చూశాను. నన్ను ఈ సినిమాలో హీరోగా పెట్టుకున్నందుకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. అయితే కథే ఈ చిత్రానికి హీరో. అద్భుతమైన కథ. మీ అందరికీ నచ్చుతుంది' అని హీరో అమిత్ తివారీ అన్నారు.
హీరోయిన్ భాను శ్రీ మాట్లాడుతూ, 'నాకు పల్లెటూరి పిల్లలా ఉండటం చాలా ఇష్టం. ఇలాంటి పాత్ర నాకు వస్తుందని ఊహించలేదు. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికే విశేష ప్రేక్షకాదరణ పొందాయి. సినిమా కూడా అదే స్థాయిలో అలరిస్తుందని ఆశిస్తున్నా' అని తెలిపారు. 'అడవిని అడవి తల్లి.. గోవును గోమాత అని అంటాం. బానిస బతుకుల నుంచి భారతదేశం స్వేచ్ఛావాయివులను పీల్చుకుంటున్న సమయంలో నల్లమల అడవుల్లోకి మానవ రూపంలో ఉన్న క్రూరమగం ఎంట్రీ అయింది. ఆ మగం ఎంట్రీ అయ్యాక ఏం జరిగింది అనేదే ఈ కథ' అని దర్శకుడు రవి చరణ్ చెప్పారు.