Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమిక, తాన్య హోప్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం 'ఇదే మా కథ'. జీ మహేష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి గురు పవన్ దర్శకుడు. ఈ చిత్రం ఈనెల 2న విడుదల కానుంది.
ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ గురువారం మీడియాతో మాట్లాడుతూ, 'దర్శకుడు గురు ఈ సబ్జెక్ట్ తన డ్రీమ్ అని చెప్పాడు. రియల్ ఇన్సిడెంట్లు కూడా ఉంటాయి. ఓ నలుగురు బైక్ ట్రావెల్లర్స్ కలవడం, వారి కష్టాలను ఒకరినొకరు ఎలా పంచుకున్నారు?, ఎలా పరిష్కరించుకున్నారు అనేదే కథ. ఇక్కడి నుంచి లడఖ్ వరకు బైక్ రైడింగ్ అని చెప్పడంతోనే షాక్ అయ్యాను. ఇందులో మహేంద్ర పాత్రలో కనిపిస్తా. 24 ఏళ్ల క్రితం మిస్ అయిన అమ్మాయిని కలుసుకునేందుకు లడఖ్ వెళ్తాను. బైక్‌లోనే ఎందుకు వెళ్తాను అనే దానికి ఓ కథ ఉంది. కులు మనాలి నుంచి లడఖ్ వరకు బైక్ మీద షూటింగ్ చేశాం. ఇది యూత్‌ను టచ్ చేసే కథ. అంతే కాదు వారిలో ఆలోచనలు రేకెత్తించేలా చిత్రం ఉంటుంది. కలను సాకారం చేసుకునేందుకు చాలా కష్టపడాలి. సంకల్పం లేకపోతే లక్ష్యాన్ని చేరుకోలేమనే థీమ్‌తో నడుస్తుంది. ఇలాంటి చిత్రాలను తెరకెక్కించాలంటే నిర్మాతలకు గట్స్ ఉండాలి.
'అఖండ' సినిమాలో కొత్తగా కనిపిస్తాను. రగ్డ్ గెటప్‌లో ఉంటాను. మహిళా ప్రేక్షకులు మళ్లీ నన్ను తిడతారేమో అని టెన్షన్ పడుతున్నా (నవ్వుతూ). నా పాత్ర చాలా క్రూరంగా ఉంటుంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా ఎంతో మంది హీరోలు లాంచ్ అయ్యారు. ఆ అవకాశం 'పెళ్ళి సందడి' రూపంలో మా రోషన్‌కు రావడం అదష్టం. ఇందులో బాస్కెట్ బాల్ ప్లేయర్‌గా రోషన్ నటించాడు. దసరా కానుకగా ఈ సినిమా రిలీజ్ అవుతోంది' అని తెలిపారు.