Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అఖిల్, పూజా హెగ్డే జంటగా 'బొమ్మరిల్లు' భాస్కర్ తెరకెక్కించిన చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పకులుగా, బన్నీ వాస్, వాసు వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని గురువారం థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ వేడుకని చిత్ర బృందం నిర్వహించారు.
ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ, 'ఈ చిత్రానికి ఇది మొదటి ఫంక్షన్. దీని తర్వాత ప్రీరిలీజ్ వేడుక, విడుదలైన తర్వాత సక్సెస్‌మీట్ తప్పకుండా ఉంటాయి. గీతాఆర్ట్స్‌లో విజయవంతమైన చిత్రాలను మేం ఇవ్వలేదు. ప్రేక్షకులు మాకు ఇచ్చారు. ఒక మంచి మెసేజ్‌ని ఎంటర్టైనింగ్ రూపంలో ఈ సినిమా ద్వారా చెప్పారు. అఖిల్, పూజా జంట మిమ్మల్ని ఫిదా చేస్తుంది. బొమ్మరిల్లు భాస్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ మంచి పాయింట్‌తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఈ సినిమా ఇంత బాగా రావడానికి నిర్మాతలు బన్నీవాసు, వాసువర్మ కష్టంతోపాటు వాళ్ళ ప్యాషనే కారణం. ఈనెల 15న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం' అని చెప్పారు.
అఖిల్ మాట్లాడుతూ, 'ఈ కథని నమ్మి బన్నీవాసు ఈ సినిమా చేశారు. విభిన్నమైన అనుబంధాలను ఈ కథ ద్వారా మీరు కచ్చితంగా చూస్తారు. థియేటర్లో ఒక జంట సినిమా చూస్తుందంటే, కచ్చితంగా నాలుగైదు సార్లు ఒకరినొకరు చూసుకుంటారు. 'మన మధ్యన కూడా ఇది జరుగుతోంది' అని మనసులో భావిస్తారని నేను అనుకుంటున్నా. ఇలాంటి మంచి సినిమా ఇచ్చినందుకు దర్శకుడు భాస్కర్‌కి థ్యాంక్స్. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతీ క్షణాన్ని ఆస్వాదించా. అన్ని విభాగాలపై పట్టున్న నిర్మాత బన్ని వాస్. పూజాహెగ్డేతో కలిసి పనిచేయడం బాగుంది' అని అన్నారు.
తెలుగు ప్రేక్షకులు ఇచ్చిన ధైర్యాన్ని చూసి, ఇప్పుడు బాలీవుడ్ సినిమాలు కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ వేదికగా ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డిగారికి ఓ విన్నపం చేస్తున్నా, ఫిల్మ్ ఇండిస్టీ అనేక ఇబ్బందుల్లో ఉంది. రాజు తలుచుకుంటే, వరాలకు కొదవా?, దయచేసి సమస్యలకు పరిష్కారం చూపమని కోరుతున్నా. మీరు చిత్ర పరిశ్రమను ఎంత ప్రోత్సహిస్తారో, అన్ని సినిమాలు విడుదలకు సిద్ధమవుతాయి. నేను చేసే విన్నపాన్ని ఇండిస్టీ విన్నపంగా తీసుకోండి. మీరు తీసుకునే నిర్ణయంపైనే తెలుగు సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉంది.
- అల్లు అరవింద్