Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిర్మాతలు దిల్‌రాజు, డి.వి.వి.దానయ్య, నవీన్ ఎర్నేని, వంశీరెడ్డి, సునీల్ నారంగ్, బన్నీవాసు శుక్రవారం పవన్‌కళ్యాణ్‌ని కలిసి చిత్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై చర్చించారు.
అయితే ఈ నిర్మాతలే గురువారం ఏపీ మంత్రి పేర్నినానిని కూడా కలిసి, ఆయనతోనూ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడారు. అటు ఏపీ మంత్రి పేర్ని నానితో, ఇటు పవన్‌కళ్యాణ్‌తో ఈ ఆరుగురు నిర్మాతలు జరిపిన చర్చల తాలూకా విషయాలను అధికారికంగా ప్రకటించలేదు. దీంతో పరిశ్రమ వర్గాల్లో అయోమయం నెలకొందని, ఏ విషయాలపై చర్చించారనే అంశాలపై ఈ నిర్మాతలు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని పరిశ్రమకు చెందిన పలువురు నిర్మాతలు అభిప్రాయం వ్యక్తం చేశారు.