Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఆ ఆరుగురు నిర్మాతలు ఆడుతున్న డబుల్ గేమ్ వల్లే పవన్ కల్యాణ్, పోసాని మధ్య వివాదానికి దారి తీసిందనే అభిప్రాయాన్ని నిర్మాత, దర్శకుడు నట్టికుమార్ వ్యక్తం చేశారు. నిర్మాతలు దిల్‌రాజు, డి.వి.వి.దానయ్య, నవీన్ ఎర్నేని, వంశీరెడ్డి, సునీల్ నారంగ్, బన్నీవాసు ఏపీ మంత్రి పేర్నినానితో గురువారం చర్చలు జరిపారు. ఆ చర్చల సారాంశాన్ని ఈ ఆరుగురు నిర్మాతలెవ్వరూ పరిశ్రమకు తెలియజేయలేదు.
ఈ నేపథ్యంలో శుక్రవారం నట్టికుమార్ మీడియాతో మాట్లాడుతూ, 'ఏపీ మంత్రి పేర్ని నానిని కలసి వచ్చిన పరిశ్రమకు చెందిన నిర్మాతలు అక్కడ మాట్లాడిన విషయాలను స్పష్టంగా పరిశ్రమకు తెలియజేయకపోవడం అనేక అపోహలకు దారి తీస్తోంది. అక్కడ ఏం మాట్లాడి వచ్చారని పరిశ్రమ నుంచి వెళ్లిన ఆ పెద్ద మనుషులు బయటకు వెల్లడించకపోగా, పవన్‌ను రెచ్చగొట్టేలా డబుల్ గేమ్ ఆడారు. దాంతో పవన్ మాట్లాడిన మాటలు వివాదమయ్యాయి. రాజకీయాల గురించి పవన్ ఏవైనా మాట్లాడుకోవచ్చు. కానీ సినీరంగం గురించి మాట్లాడేటప్పుడు వాస్తవిక విషయాలు తెలుసుకుని ఆయన మాట్లాడితే బాగుండేది. పవన్‌తో సినిమాలు తీస్తున్న ఆ పెద్ద మనుషులే మంత్రి పేర్ని నాని దగ్గరికెళ్ళి క్షమాపణలు చెప్పారు. పవనే వారిని పంపించినట్లు బయట వదంతులు కూడా వినిపిస్తున్నాయి. అయితే దీన్ని పవన్ ఏ విధంగా తీసుకుంటారు?, ఆ నిర్మాతల డబుల్ గేమ్‌ను సమర్థిస్తారా? లేదా అనేది ఆయనే తేల్చుకోవాల్సిన అంశం. నటుడు, రచయిత పోసాని కష్ణమురళి ఇంటిపై పవన్ కళ్యాణ్ ఫాన్స్ దాడి చేయటం హేయమైన చర్య. అలాగే ఫ్యామిలీస్ గురించి పోసాని మాట్లాడటం కూడా తప్పే. ఇలాంటి వివాదాలకు ఫుల్ స్టాఫ్ పడే విధంగా చిరంజీవి, మోహన్ బాబు, జీవిత రాజశేఖర్, విష్ణు తదితరులు చర్యలు తీసుకోవాలి. ఈ దాడులను వారంతా ఖండించాలి. ఆన్లైన్ టికెట్ విధానం మంచిదే. పారదర్శకత ఉంటుంది. కానీ దాని నిర్వహణ ఎలా ఉంటే బాగుంటుందో అధ్యాయనం తర్వాతే ప్రభుత్వం ప్రవేశ పెట్టాలని కోరుకుంటున్నా' అని చెప్పారు.