Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హర్షా నర్రా, నికీషా రంగ్వాలా, మిషా నారంగ్ హీరో, హీరోయిన్లుగా నటించిన సినిమా 'మిస్సింగ్'. భజరంగబలి క్రియేషన్స్ పతాకంపై భాస్కర్ జోస్యుల, లక్ష్మీశేషగిరి రావు నిర్మించారు. ఈ చిత్రంతో శ్రీని జోస్యుల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 22న థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ,'ఇదొక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. ఫస్ట్, సెకండ్ కరోనా వేవ్‌లను తట్టుకుని, లాక్‌డౌన్‌లోనూ ఎంతో పట్టుదలగా సినిమాని కంప్లీట్ చేశాం. ఈనెల 22న మా చిత్రాన్ని థియేటర్ల ద్వారా మీ ముందుకు తీసుకురాబోతున్నాం. మంచి హిట్ కొడతాం అనే నమ్మకంతో ఉన్నాం' అని చెప్పారు.
'ఇప్పటి వరకు ఎన్నో థ్రిల్లర్ చిత్రాలొచ్చాయి. వాటితో పోలిస్తే మా సినిమా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. సినిమా ఆద్యంతం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుంది. సినిమాటోగ్రాఫర్ జనా లేకపోతే ఈ మూవీ ఇంత బాగా వచ్చేది కాదు. ఈ సినిమాలో బెస్ట్ మ్యూజిక్ వింటారు. ప్రేక్షకులకు థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవాలనే లక్ష్యంతో మా చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం. ఇటీవల విడుదలైన ట్రైలర్, ప్రమోషనల్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది' అని దర్శకుడు అన్నారు.