Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శర్వానంద్, సిద్దార్థ్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం 'మహా సముద్రం'. 'ఆర్ ఎక్స్ 100' ఫేమ్ అజరు భూపతి విభిన్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇన్టెన్స్ లవ్, యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా రిలీజ్ అవుతోంది.
ఈ నేపథ్యంలో తాజాగా 'హే తికమక.. మొదలే..' అంటూ సాగే పల్లవిగల పాటను చిత్ర బృందం రిలీజ్ చేసింది. 'చైతన్ భరద్వాజ్ అందించిన సంగీతం ఈ చిత్రానికి అతి పెద్ద అసెట్. ట్రైలర్లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఇప్పటికే రిలీజైన సాంగ్స్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా 'హే తికమక.. మొదలే' అంటూ సాగే మూడవ లిరికల్ వీడియోను విడుదల చేశాం. ఈ పాటకి కూడా అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ పాటలో రెండు జంటల ప్రేమ కథలు కనిపిస్తున్నాయి. శర్వానంద్, అను ఇమాన్యుయేల్, సిద్దార్థ్, అదితీ రావు హైదరీ జంటలు అందర్నీ ఫిదా చేస్తున్నాయి. ఈ పాట ఎంత అద్భుతంగా ఉందో, వీళ్ళ మధ్య కెమిస్ట్రీ కూడా అంతే అద్భుతంగా ఉంటంతో ఈ పాట అందర్నీ విశేషంగా అలరిస్తోంది. హరి చరణ్, నూతన్ మోహన్ ఈ పాటను ఆలపించారు. కిట్టు వరప్రసాద్ సాహిత్యాన్ని అందించారు. ప్రేక్షకుల అంచనాలకు మించి భావోద్వేగాల సమాహారంగా ఈ సినిమా అలరిస్తుంది. ఈనెల 14న విడుదలయ్యే ఈ సినిమా ఘన విజయం సాధిస్తుంది' అని చిత్ర యూనిట్ చెప్పింది.