Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వైష్ణవ్ తేజ్ తాజాగా నటిస్తున్న చిత్రం 'కొండపొలం'. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. రకుల్ ప్రీత్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం ఈనెల 8న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుండి 'నీలో..నాలో..శ్వాసలో..' అంటూ సాగే పాటని మేకర్స్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ, 'స్వరవాణి కీరవాణి మార్క్ చూపించే రొమాంటిక్ మెలోడి గీతమిది. ఈ పాటకు కీరవాణి సాహిత్యాన్ని కూడా అందించడం ఓ విశేషమైతే, ఆయన సాహిత్యం, బాణీ ఇప్పుడు అందరినీ కట్టిపడేయటం మరో విశేషం. వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ చూడచక్కని కెమిస్ట్రీని మరో లెవెల్లో చూపించారు. యామిని ఘంటసాల, పీవీఎన్ఎస్ రోహిత్ ఈ పాటను అంతే శ్రావ్యంగా ఆలపించారు. ఈ పాట మరో సూపర్ హిట్ సాంగ్‌గా నిలిచిపోవడం ఖాయం. వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ ఫస్ట్ లుక్ పోస్టర్స్, ఓబులమ్మ సాంగ్‌కి, అలాగే రీసెంట్గా రిలీజ్ చేసిన ట్రైలర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సన్నపురెడ్డి వెంకట రామి రెడ్డి రాసిన నవల నుంచి ఈ కథను తీసుకున్నారు. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ బృందం ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ యూ సర్టిఫికేట్ ఇవ్వడంతో పాటు మేకర్స్‌ను ప్రశంసించారు. 2:15 గంటల రన్టైమ్తో ఈ
సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బిబో శ్రీనివాస్ సమర్పణలో సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి కలిసి సంయుక్తంగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు' అని తెలిపారు.