Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగ శౌర్య, రీతువర్మ హీరో, హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం 'వరుడు కావలెను'. లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజాగా 'వడ్డాణం చుట్టేసి వచ్చారే భామలు..' అంటూ సాగే పల్లవిగల పాటను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పాటకు విశేష స్పందన లభిస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ మాట్లాడుతూ, 'గీత రచయిత రఘురామ్ సాహిత్యం అందించిన ఈ పాటను గాయనీ, గాయకులు శ్రీకష్ణ, గీతామాధురి, ఎం ఎల్ గాయత్రి, అదితి భావరాజు, శ్రుతి రంజని వీనుల విందుగా ఆలపించారు. విశాల్ చంద్రశేఖర్ సమకూర్చిన సంగీతం ఎంతో హుషారుగా సాగుతుంది. నాయకానాయికలు నాగశౌర్య, రీతువర్మలతో పాటు ఇతర ప్రధాన తారాగణం పాల్గొనగా కథానుసారం ఓ పెళ్లి వేడుక నేపథ్యంలో ఈ పాట వస్తుంది. హుషారైన సంగీతం, చక్కని సాహిత్యం ఈ పాట సొంతం. వీటికి తోడు బంద మాస్టర్ నత్య రీతులు మరింత జోష్ పెంచాయి. ప్రస్తుతం చిత్ర నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్టోబర్ 15న దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు' అని చెప్పింది.