Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం 'పుష్ప'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా మొదటి భాగం 'పుష్ప : ది రైజ్'ను డిసెంబర్ 17న ఐదు భాషల్లో ఒకేసారి విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం శనివారం అధికారికంగా ప్రకటించింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాబోతున్నట్టు దర్శక, నిర్మాతలు తెలిపారు.
ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ, 'అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో దాదాపు పదేళ్ళ తర్వాత వస్తున్న చిత్రమిది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు రికార్డులను తిరగ రాశాయి. తెలుగు ఇండిస్టీలో మరే హీరోకి సాధ్యం కాని రీతిలో అల్లు అర్జున్ 'పుష్ప' టీజర్‌తో సరికొత్త చరిత్ర సష్టించారు. పుష్పరాజ్‌గా అల్లుఅర్జున్, శ్రీవల్లిగా రష్మిక మందన్నా క్యారెక్టర్ పోస్టర్లకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ప్రతినాయకుడిగా పహాద్ ఫాజిల్ లుక్ సైతం అందరిలోనూ క్యూరియాసిటీని రైజ్ చేసింది. దీంతో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు కూడా భారీ స్థాయిలో ఉన్నాయి. ఆ అంచనాలకు దీటుగా ఈ సినిమా కచ్చితంగా ఉంటుంది' అని చెప్పారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: మిరోస్లా క్యూబా బ్రోజెక్, సంగీతం: దేవి శ్రీ ప్రసాద్, సౌండ్ డిజైన్: రసూల్ పూకుట్టి, ఎడిటర్: కార్తిక శ్రీనివాస్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, పీటర్ హెయిన్, లిరిసిస్ట్: చంద్రబోస్, నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్.