Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాలుగేండ్ల నాగచైతన్య, సమంతల వైవాహిక బంధానికి తెరపడింది. 'అవును.. విడిపోతున్నాం' అంటూ వీళ్ళిద్దరూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దీంతో గత రెండు నెలలుగా చై-సామ్ డైవర్స్కి సంబంధించిన వచ్చిన వార్తలు, ఊహా గానాలు నిజమవ్వడంతో ఇరువురి అభిమానులు తీవ్ర నిరాశ చెందారు.
'మా శ్రేయోభిలాషులందరికీ.. ఇక నుంచి మేం భార్యా భర్తలుగా దూరంగా ఉండాలను కుంటున్నాం. చాలా చర్చలు, ఆలోచనల తర్వాత విడిపోవాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇక నుంచి వేర్వేరుగా మా సొంత మార్గాల్లో ప్రయాణించాలనుకుంటున్నాం. పదేళ్లుగా మా స్నేహం కొనసాగినందుకు మేం అదష్టవంతులం. ఇప్పుడు ఈ కష్ట సమయంలో అభిమానుల మద్దతు కావాలి. మా వ్యక్తిగత జీవితాలకు సంబంధించి ప్రైవసీని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం' అంటూ నాగచైతన్య, సమంత సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. 'ఏమాయ చేసావె' సినిమా చైతూకు తొలి విజయాన్ని అందించడమే కాకుండా, వ్యక్తిగత జీవితాన్ని కూడా మలుపు తిప్పింది. ఈ చిత్రంలో నటిస్తున్నప్పుడే సమంత, నాగచైతన్యల మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. ఇరు కుటుంబాలు పెళ్లికి అంగీకరించడంతో అక్టోబరు 6న (2017) హిందూ వివాహ పద్ధతిలో, అక్టోబరు 7న క్రిస్టియన్ పద్ధతిలో వివాహ వేడుక నిర్వహించారు. అప్పట్నుంచి ఈ జోడీకి చిత్ర పరిశ్రమలోను, అలాగే పబ్లిక్‌లోనూ మంచి క్రేజ్ వచ్చింది. 'మనం', 'ఆటోనగర్ సూర్య' 'మజిలీ', 'ఓ బేబీ' చిత్రాల్లో చై-సామ్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
ఎంతో బరువైన హదయంతో ఈ విషయాన్ని చెప్పాల్సి వస్తోంది. సామ్ - చై విడిపోవటం నిజంగా దురదష్టకరం. భార్యాభర్తల మధ్య ఏం జరిగినా అది వాళ్ల వ్యక్తిగతం. వీళ్ళిద్దరూ నాకెంతో దగ్గరి వారు. సమంతతో నా కుటుంబం గడిపిన ప్రతి క్షణం ఎంతో మధురమైంది. ఆమె మా కుటుంబానికి చాలా దగ్గరైంది. దేవుడు వాళ్లిద్దరికీ మనో ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా. వారికి నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి.
- నాగార్జున