Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమిక, తాన్య హోప్ నటించిన చిత్రం 'ఇదే మా కథ'. శ్రీమతి గుర్రప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్ మీద జి. మహేష్ నిర్మించారు. గురు పవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శనివారం విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ,' 'సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ బాగుందని ఫోన్లు చేస్తున్నారు. చాలా రోజుల తరువాత నాకు మంచి విజయం దక్కింది' అని చెప్పారు. 'సినిమాను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారా? అని ఎక్కువగా టెన్షన్ పడ్డాం. కానీ ఆ కష్టం అంతా ప్రేక్షకుల ప్రశంసలతో మరిచిపోయాం. ఇంత మంచి విజయాన్ని అందించినందుకు ప్రేక్షకులకు థ్యాంక్స్' అని మరో హీరో సుమంత్ అశ్విన్ అన్నారు. దర్శకుడు గురు పవన్, నిర్మాత మహేష్ చిత్ర విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.