Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న చిత్రం 'భీమ్లానాయక్'. సాగర్.కె.చంద్ర దర్శకుడు. సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మలయాళ సూపర్ హిట్ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్‌కళ్యాణ్ సరసన నిత్యామీనన్ నటిస్తున్నారు. అలాగే రానాకి జోడిగా మరో మలయాళ కథానాయిక సంయుక్త మీనన్ ఎంపికయ్యారు. ఈ విషయాన్ని సంయుక్త సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ''భీమ్లా నాయక్' లో రానా సరసన నటిస్తుండటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాతో సంక్రాంతి పక్కా మాస్‌గా మారడం ఖాయం' అని సంయుక్త ట్వీట్ పెట్టారు. డేనియల్ శేఖర్‌గా రానా నటిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.