Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జొన్నలగడ్డ హరికష్ణ, ప్రీతి సేన్ గుప్తా జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'ఆటో రజని'. శ్రీనివాస్ జొన్నలగడ్డ ఫిలిమ్స్, శ్రీ మహా లక్ష్మి ఎంటర్ప్రైజెస్ పతాకంపై శ్రీనివాస్ జొన్నలగడ్డ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సావిత్రి.జె నిర్మాత. ఈ చిత్ర పూజా కార్యక్రమాలు ఆదివారం రామానాయుడు స్టుడియోలో సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగాయి. హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు బాపట్ల ఎం.పి నందిగం సురేష్ క్లాప్ నివ్వగా, ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కెమెరా స్విచ్చాన్ చేశారు. మధుసూదన్ రెడ్డి, సిద్దార్థరెడ్డి, గౌతంరెడ్డి తదితరులు గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాస్ మాట్లాడుతూ,'ఇదొక లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్. వైజాగ్, విజయవాడ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహిస్తాం. ఈ నెల 15 నుంచి విజయవాడలో రెగ్యులర్ చిత్రీకరణను ఆరంభిస్తాం. అక్టోబర్, నవంబర్‌లో సినిమాని పూర్తి చేసి, హాలిడేస్‌లో విడుదల చేస్తాం. మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా తప్పక విజయం సాధిస్తుంది. అందరి సహకారంతో నా సినిమాని రిలీజ్ చేసుకోగలను అనే నమ్మకంతో ఉన్నాను' అని చెప్పారు.
'మంచి మెసేజ్‌తో లవ్ అండ్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తుంది' అని నిర్మాత సావిత్రి అన్నారు. హీరో జొన్నలగడ్డ హరికష్ణ మాట్లాడుతూ,'ఇది నా రెండో సినిమా. ఇదొక మాస్ సినిమా. ఈ సినిమాలో నేను పుట్టిన దగ్గర్నుంచి రజనీకాంత్ అభిమానిని. ఇలాంటి మంచి సినిమాలో నటించే ఛాన్స్ ఇచ్చిన మా తల్లి, తండ్రులకు ధన్యవాదాలు' అని తెలిపారు. 'మాది కలకత్తా. ఇది నా మొదటి తెలుగు సినిమా. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు' అని కథానాయిక ప్రీతీ సేన్ గుప్తా చెప్పారు.