Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యాక్సిడెంట్ కారణంగా గత కొన్ని రోజులుగా ఐసియుకే పరిమితమైన కథానాయకుడు సాయితేజ్ సోషల్ మీడియా వేదికగా తొలిసారి స్పందించారు. అలాగే పూర్తిగా కోలుకున్నాను అనే దానికి సంకేతంగా ట్విటర్లో థంబ్స్ అప్ సింబల్ పెట్టడంతో ఆయన అభిమానుల ఆనందానికి ఆకాశమే హద్దయ్యింది.
'మీరు నాపై, నా సినిమా 'రిపబ్లిక్'పై చూపించిన ప్రేమ, అభిమానం, ఆదరణకు కతజ్ఞతగా థ్యాంక్స్ చెప్పడం అనేది చాలా చిన్న మాట అవుతుంది. త్వరలోనే మీ అందరి ముందుకు వస్తాను' అని ట్వీట్లో సాయితేజ్ పేర్కొన్నారు. దీంతో తమ హీరో పూర్తి స్థాయిలో కోలుకున్నాడంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపించారు. సినీ వర్గాలు, ఆయన స్నేహితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు సైతం ఆనందం వ్యక్తం చేస్తూ ఆయనకు విషెస్ తెలిపారు.
సెప్టెంబరు 10న స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తున్న సాయితేజ్‌కి ఊహించని రీతిలో ప్రమాదం జరిగి, అపస్మారక స్థితిలో వెళ్లారు. వెంటనే స్పందించిన స్థానికులు, పోలీసులు 108 సాయంతో దగ్గర్లోని మెడికవర్ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సాయితేజ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆయన పెట్టిన ట్వీట్ చెప్పకనే చెబుతోంది. సాయితేజ్ హీరోగా నటించిన 'రిపబ్లిక్' చిత్రం ఇటీవల విడుదలై, విశేష ఆదరణ పొందుతోంది. దేవా కట్టా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయితేజ్ కలెక్టర్‌గా నటించి, మెప్పించారు.