Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న చిత్రం 'పెళ్లి సందడి'. ఈ చిత్రంతో ఆయన నటుడిగా పరిచయం అవ్వడం ఓ విశేషమైతే, ఆయన శిష్యురాలు గౌరి రోణంకి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయటం మరో విశేషం.
ఆర్కా మీడియా వర్క్స్, ఆర్.కె ఫిలిం అసోసియేట్స్ బ్యానర్స్‌పై కె.కష్ణమోహన్రావు సమర్పణలో మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ యు సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది.
దర్శకేంద్రుడు తెరకెక్కించిన నాటి బ్లాక్‌బస్టర్ 'పెళ్లిసందడి'లో హీరోగా శ్రీకాంత్ నటిస్తే, ఆయన శిష్యురాలు గౌరి రోణంకి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించటం మరో విశేషం. శ్రీలీల కథానాయిక.
'సినిమా ప్రమోషన్స్‌ను ప్లానింగ్ ప్రకారం చేసుకుంటూ రావడంతో ఈ సినిమా అందరికీ రీచ్ అయ్యింది. ఈ సినిమా నుంచి విడుదలైన రాఘవేంద్రరావు ప్రోమో, హీరో, హీరోయిన్ ప్రోమోలు, సాంగ్స్, టీజర్, రీసెంట్గా విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుని, క్లీన్ యు సర్టిఫికేట్ పొందింది. ఈ క్యూట్ అండ్ బ్యూటీఫుల్ లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ను దసరా కానుకగా ఈ నెల 15న విడుదల చేస్తున్నాం' అని దర్శకురాలు గౌరి రోణంకి అన్నారు. ప్రకాశ్‌రాజ్, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, తనికెళ్ల భరణి, పోసాని కష్ణ మురళి, వెన్నెల కిషోర్, సత్యంరాజేష్, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ రెడ్డి, శకలక శంకర్, అన్నపూర్ణ, జాన్సి, ప్రగతి, హేమ, కౌముది, భద్రం, కిరీటి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి, సాహిత్యం: శివశక్తి దత్త, చంద్రబోస్, సినిమాటోగ్రఫి: సునీల్ కుమార్ నామ, ఎడిటర్: తమ్మిరాజు, ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నె, మాటలు: శ్రీధర్ సీపాన, ఫైట్స్: వెంకట్, కొరియోగ్రఫి: శేఖర్ వీజే. -