Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)కి మావంతు సాయం చేశాం. బండ్ల గణేశ్, పథ్వీ, రాజీవ్ కనకాల.. ఇలా ప్రపంచంలో అందరూ నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కావటం లేదు. మంచి చేయటం తప్పా?' అని జీవితా రాజశేఖర్ అన్నారు. ఈనెల 10న జరగబోయే 'మా' ఎన్నికల్లో ప్రకాష్‌రాజ్ ప్యానెల్ నుంచి జనరల్ సెక్రటరీగా ఆమె పోటీ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో సోమవారం మీడియాతో ఆమె మాట్లాడుతూ, 'నరేష్ వల్లే డైరీ వేడుకలో గొడవలు, విభేదాలూ తలెత్తాయి. 'మా' సభ్యులకు సినిమా అవకాశాలు కోసం వెబ్సైట్ అమలుకీ ఆయన ఒప్పుకోలేదు. మోహన్‌బాబు, విష్ణు అంటే నాకెంతో గౌరవం ఉంది. వీళ్ళు కూడా నరేష్లాంటి వాళ్ళని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు?, ఇటీవల ఎన్టీఆర్‌ని కలిసి, 'మీరు నాకు ఓటు వేయాలి' అని అడితే, నన్ను అడగొద్దు. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే చాలా బాధగా ఉందన్నారు. ఆయన చెప్పినట్లు నిజంగా పరిస్థితి అలాగే ఉంది. 'మా'కి మంచి చేస్తే, ఒక మహిళను టార్గెట్ చేస్తూ మాట్లాడ్డం.. మీకు సిగ్గుగా లేదా?. అలాగే 'మా' ఎన్నికల్లో ప్రాంతీయవాదాన్ని తీసుకురావడం ఎంతవరకు సమంజసం. నేను, రాజశేఖర్ 'మా'కి ఎంతో చేశాం. ఇకపై కూడా చేస్తాం' అని అన్నారు.