Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా నటించిన చిత్రం'కొండపొలం'. క్రిష్ దర్శకత్వంలో రాబోతోన్న ఈ సినిమా ఈనెల 8న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు క్రిష్ సోమవారం మీడియాతో ముచ్చటించారు.
ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. 'కొండపొలం' పుస్తకం గురించి ఇంద్రగంటి, సుకుమార్ సజెస్ట్ చేశారు. అడ్వంచర్స్ కథతో సినిమా చేయాలనుకుని 'కొండపొలం' హక్కులు తీసుకున్నాం. పుస్తకంలో రాసిన దాన్ని సినిమాగా తీయాలంటే, కొన్ని పరిమితులు ఉంటాయి. అలాగే సన్నపురెడ్డి వెంకటరెడ్డి రాసిన 'కొండపొలం' కథలో ఓబులమ్మ పాత్ర ఉండదు. అదొక అద్బుతమైన కథ. చక్కటి కథనంతో రాశారు. ప్రతీ ఎపిసోడ్ ఎంతో ఎగ్జైట్‌గా ఉంటుంది. దానికి అందమైన ప్రేమకథను జోడిస్తే ఎలా ఉంటుందని ఓబులమ్మ పాత్రను క్రియేట్ చేశాం. సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ సూచనతోనే రకుల్‌ను ఓబులమ్మ పాత్రకు తీసుకున్నాం. ఈ పాత్ర కోసం రకుల్ చాలా కష్టపడింది. గొర్రెల కాపరి జాబ్ అనేది చాలా కష్టమైన పని. పిక్నిక్లా వెళ్లడం ఉండదు. అడ్వెంచెరస్ జర్నీ. మాకు గొర్రెల భాష రాలేదు. కానీ వాటిని ఎలా కంట్రోల్ చేయాలో తెలిసింది. మేం షూటింగ్ చేస్తున్నప్పుడు ఓ చిన్న పిల్లవాడు వస్తే మాత్రం ఆ గొర్రెలన్నీ కూడా అతని వెనుకే వచ్చాయి. ఆ టెక్నిక్‌ని వైష్ణవ్ పట్టేసి, అద్భుతంగా నటించాడు. వైష్ణవ్ తేజ్‌కు నేర్చుకోవాలనే తపన ఎంతో ఉంది. అందుకే 'ఉప్పెన', 'కొండపొలం'లాంటి సినిమాలు చేశాడు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చాననే యాటిట్యూడ్ ఉండదు. తనకెంతో మంచి భవిష్యత్తు ఉంది. ఇది ఓటీటీ సినిమా కాదు. దీన్ని థియేటర్లో చూస్తేనే ఆ ఫీలింగ్ వస్తుంది. 'జంగిల్ బుక్ లాంటి చిత్రాన్ని వెంకటేష్‌తో చేయాల్సింది. కానీ 'అతడు అడవిని జయించాడు' పుస్తకం
హక్కులు దొరక్కపోవడంతో ఇది కుదర్లేదు. ప్రస్తుతం హాట్ స్టార్‌కు ఓ కథ రాస్తున్నాను. నవంబర్ రెండో వారం నుంచి పవర్‌స్టార్‌తో 'హరిహర వీరమల్లు' షూటింగ్ స్టార్ట్ చేస్తాను' అని చెప్పారు. సాధారణంగా మనకు రకరకాల భయాలు ఉంటాయి. వాటినుంచి మనకు మనమే ధైర్యాన్ని ఇచ్చుకోవాలి. కరోనా అంటే మొదట్లో చాలా భయపడ్డాం. కానీ ఇప్పుడు నార్మల్‌గానే ఉన్నాం. అలానే రవీంద్ర అనే కుర్రాడు తనలోని భయాలను జయించి, వాటిలోంచి బయటకు రావడానికి ఏం చేశాడన్నదే ఈ సినిమా.సాధారణంగా మనకు రకరకాల భయాలు ఉంటాయి. వాటినుంచి మనకు మనమే ధైర్యాన్ని ఇచ్చుకోవాలి. కరోనా అంటే మొదట్లో చాలా భయపడ్డాం. కానీ ఇప్పుడు నార్మల్‌గానే ఉన్నాం. అలానే రవీంద్ర అనే కుర్రాడు తనలోని భయాలను జయించి, వాటిలోంచి బయటకు రావడానికి ఏం చేశాడన్నదే ఈ సినిమా.