Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సూర్య భరత్ చంద్ర, రేణు శ్రీ, నిరోషా హీరో, హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం 'ఆధారం'. నిర్మాత వల్లూరిపల్లి వెంకట్రావు వారసురాలు సితార వల్లూరిపల్లి పజెంట్స్లో శ్రీ వెంకట లక్ష్మి క్రియేషన్స్ పతాకంపై గోపి పోలవరపు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఫిల్మ్ ఛాంబర్లో ఘనంగా ఏర్పాటు చేసిన వేడుకలో నిర్మాత బెక్కం వేణుగోపాల్ ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాత గోపి పోలవరపు మాట్లాడుతూ, 'కొత్త నటీనటులతో ఈ సినిమా చేస్తున్నాను.అలాగే డైలాగ్స్ రాయటంతోపాటు డైరెక్షన్ కూడా నేనే చేస్తున్నాను. ఇదొక నయా క్రైమ్ థ్రిల్లర్. సందర్భానికి తగినట్టు ఇందులో ఉన్న రెండు పాటలు చాలా బాగా వచ్చాయి. అంబట్ల రవి మంచి సాహిత్యం అందించారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమా గొప్ప విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది' అని చెప్పారు.