Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాయితేజ్ హీరోగా దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'రిపబ్లిక్'. జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి.ఎంటర్టైన్మెంట్ పతాకంపై జె. భగవాన్, జె. పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. పొలిటికల్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమా ఇటీవల విడుదలై సూపర్‌హిట్ టాక్‌తో మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. అలాగే ఈ చిత్రానికి సినీ, రాజకీయ వర్గాలనుండి విశేష స్పందన లభిస్తోంది. తాజాగా ఈ చిత్రాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, సింగర్ స్మిత ప్రత్యేకంగా వీక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ''రిపబ్లిక్' సినిమా చూసి వంద ప్రశ్నలు, వంద ఆలోచనలతో బయటకు వచ్చా. ఈ చిత్రంలో ఒక ప్రాంతంలోని సమస్యను మాత్రమే చూపించి, ప్రశ్నలను మాత్రం అన్ని వ్యవస్థలపై వేసినట్టుగా తెరకెక్కించారు. ప్రజలకు ఈ సినిమా కచ్చితంగా ఉపయోగపడుతుంది. కొద్ది మందిలోనైనా మార్పు తీసుకొస్తుందని భావిస్తున్నా. యువత చూడాల్సిన అవసరం ఉంది' అని చెప్పారు. 'ఈ సినిమా చూసిన తరువాత నా గుండె బరువెక్కింది. ప్రజలు, మాలాంటి పదవుల్లో ఉన్న వ్యక్తులు కూడా సినిమాను చూసి మార్పును కోరుకోవాలి' అని అన్నారు.