Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గోపీచంద్, నయనతార జంటగా బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఆరడుగుల బుల్లెట్'. జయ బాలాజీ రియల్ మీడియా బ్యానర్ పై తాండ్ర రమేష్ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ, 'ఆకతాయిగా తిరిగే ఓ కుర్రాడు, తన తండ్రికి శత్రువుల వల్ల ఎదురైన సమస్యను ఎలా పరిష్కరించాడు?, విలన్ల నుంచి తన తండ్రిని, కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? అనే అంశాలతో ఉన్న ట్రైలర్ ఆద్యంతం అందర్నీ ఆకట్టుకుంటోంది. దర్శకుడు బి.గోపాల్ తన మార్క్ మేకింగ్‌తో ఈచిత్రాన్ని పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించారు. గోపీచంద్, నయనతార, బి.గోపాల్ వంటి రేర్ కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రంపై ఇప్పటికే అందరిలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు దీటుగా ఈ సినిమా ఉంటుంది. అన్ని కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రాన్ని ఈనెల 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు' అని తెలిపారు.