Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జర్నలిస్టుగా, పంపిణీదారుడిగా, నిర్మాతగా, నటుడిగా, పీఆర్వోగా సురేష్ కొండేటి తెలుగునాట ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. నేడు (బుధవారం) ఆయన పుట్టిన రోజు.
ఈ సందర్భంగా ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, 'పీఆర్వోగా దాదాపు 600 చిత్రాలకు పని చేశాను. మహేశ్వరి ఫిల్మ్ ద్వారా పశ్చిమగోదావరి జిల్లాలో ఎన్నో సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశా. ఎస్కె పిక్చర్స్ సంస్థను స్థాపించి, 'స్టూడెంట్ నెంబర్1' చిత్రంతో పంపిణీదారుడిగా మారి, ఇప్పటివరకు 75 చిత్రాలను చేశాను. ఆ అనుభవంతోనే 'ప్రేమిస్తే' చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టి, 'జర్నీ' 'పిజ్జా'.. ఇలా దాదాపు పదిహేను చిత్రాలను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చా. గత ఏడాది కరోనా వల్ల ఆగిన సంతోషం అవార్డ్స్ కార్యక్రమాన్ని ఈ ఏడాది ఘనంగా నిర్వహించేందుకు సమాయత్తం అవుతున్నా. 2019-2020 రెండు సంవత్సరాల అవార్డులను ఒకే వేదికపై ఇవ్వబోతున్నాం. అలాగే బాలుగారి గౌరవార్ధం 5 భాషలకు చెందిన పదిమంది గాయనీగాయకులకు అవార్డులు ఇస్తాం. ప్రస్తుతం 'మిస్టర్ ప్రెగెంట్', 'ఎర్రచీర' చిత్రాల్లో నటించా. అలాగే నిర్మాతగా నేను నిర్మిస్తున్న సినిమాలోనూ ఓ ముఖ్య పాత్రని పోషిస్తున్నా. భవిష్యత్తులో హీరోగా నటించాలని, దర్శకత్వమూ చేయాలని ఉంది. దర్శకరత్న దాసరి గారు నాకు స్ఫూర్తి. ఆయనలా అన్నింటిలోనూ రాణించాలని ఉంది. ఈనెల 10న జరగబోయే 'మా' ఎన్నికల్లో ప్రకాష్‌రాజ్ ప్యానెల్ తరఫున ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా పోటీ చేస్తున్నాను' అని అన్నారు.