Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'హుషారు' ఫేమ్ అభినవ్ మేడిశెట్టి, రమ్య పసుపులేటి జంటగా నందన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'మైల్స్ అఫ్ లవ్'. కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై రాజిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను యువ కథానాయకుడు శ్రీ విష్ణు విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ఈ సినిమా టీజర్ చూశా. చాలా ఫ్రెష్‌గా ఉంది. హీరో అభినవ్ చాలా అందంగా కనిపించాడు. ఈ సినిమాకి అందరూ కొత్తవాళ్లే పని చేశారు. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. త్వరలోనే థియేటర్లలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మీ అందరు ఈ సినిమాను ఆదరించాలని ఆశిస్తున్నాను' అని చెప్పారు.'మెలోడీ మ్యూజిక్‌తో టీజర్ మొదలవుతుంది. పాటల మాదిరిగానే నేపథ్య సంగీతం కూడా ప్రేక్షకులను మెప్పిస్తుందని ఈ టీజర్‌తో మేకర్స్ ముందే చెప్పటం విశేషం. హీరో, హీరోయిన్లు చాలా క్యూట్‌గా కనిపించి, అందర్నీ ఫిదా చేస్తున్నారు. మంచి విజువల్స్‌తో సినిమాటోగ్రాఫర్ ఆకట్టు కున్నారు. టీజర్‌లోని విజువల్స్ సినిమాపై మరింత ఇంట్రెస్ట్ తెప్పిస్తున్నాయి. ఇదొక ప్యూర్ అండ్ హానెస్ట్ లవ్‌స్టోరీ అని టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఎంతో ఫీల్‌తో హీరో, హీరోయిన్ల లవ్ స్టోరీ ఉండబోతుంది. ఎమోషనల్ సీన్స్ కూడా ప్రేక్షకులను అలరిస్తాయని టీజర్ చివర్లో వచ్చే ఓ షాట్ ద్వారా చూపించారు. టీజర్లో కథను చెప్పే ప్రయత్నం చేసి, మాటలతో ప్రేక్షకులను దర్శకుడు ఆకట్టుకున్నారు. నిర్మాణ విలువలు కూడా చాలా రిచ్‌గా కనిపించాయి. అందమైన లొకేషన్స్‌లో సినిమాని చిత్రీకరించి, ఓ విజువల్ ట్రీట్ ఇచ్చే ప్రయత్నమూ చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే ఓ అద్భుతమైన సినిమాగా త్వరలోనే థియేటర్లలో రిలీజ్ కానుంది' అని చిత్ర యూనిట్ పేర్కొంది.