Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల వాతావారణం రోజు రోజుకి మరింత హీట్టెక్కుతోంది. ఆరోప ణలు, ప్రత్యారోపణలతో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్‌రాజ్, మంచు విష్ణు ఒకరిపై మరొకరు మాటల యుద్ధం చేస్తున్నారు. దీంతో ఈనెల 10న జరగబోతున్న 'మా' ఎన్నికలు మరింత రసవత్తరంగా మారబోతున్నాయి. ఈ నేపథ్యంలో అటు ప్రకాష్‌రాజ్ ప్యానెల్, ఇటు మంచు విష్ణు ప్యానెల్ మంగళవారం మీడియా సమావేశాన్ని నిర్వహించాయి.
ఈ సందర్భంగా ప్రకాష్‌రాజ్ మాట్లాడుతూ, 'విష్ణు ప్యానెల్ ఏజెంట్ల ద్వారా పోస్టల్ బ్యాలెట్ కుట్ర చేస్తున్నారు. అర్హత ఉన్న సభ్యుల నుంచి సంతకాలు సేకరిస్తున్నారు. అంతేకాకుండా విష్ణు తరఫున ఓ వ్యక్తి 56 మంది సభ్యుల తరఫున రూ.28వేలు కట్టారు. కష్ణ, కష్ణంరాజు, శారద, పరుచూరి బ్రదర్స్, శరత్‌బాబు తదితరుల పోస్టల్ బ్యాలెట్ డబ్బులను కూడా విష్ణు తరఫు వ్యక్తే కట్టారు. ఆగంతుకులతో 'మా' ఎన్నికలు నిర్వహిస్తామా?, ఇలా గెలుస్తారా?,మీ హామీలు చెప్పి గెలవరా?, ఇంతగా దిగజారుతారా?' అని ప్రకాశ్‌రాజ్ అన్నారు. అలాగే విష్ణు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఎన్నికల సంఘానికి ప్రకాష్‌రాజ్ ఫిర్యాదు కూడా చేశారు. ప్రకాష్‌రాజ్ చేసిన ఆరోపణలకు విష్ణు దీటుగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ, ''మా' ప్యానెల్ సభ్యులు పేపర్ బ్యాలెట్‌కు వెళ్దామన్నారు. అందుకే ఈవీఎంలు అయితే ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉండటంతో అవి వద్దని 'మా'కి లేఖ రాశా. పోస్టల్ బ్యాలెట్‌కు ప్రతీ సభ్యుడు కట్టాల్సిన రూ.500లను ఎన్నికల సంఘం అనుమతితోనే, న్యాయబద్ధంగా కట్టాం. ఆ తర్వాత ఎన్నికల సంఘం ఇలా కట్టకూడదని, డబ్బు వెనక్కి ఇచ్చింది. ఇదంతా లీగల్‌గానే జరిగితే, ఇల్లీగల్‌గా జరిగిందంటూ ప్రకాష్‌రాజ్ ఆరోపణలు చేయటం ఎంత వరకు కరెక్ట్?, అలాగే 'మంచు ఫ్యామిలీ' అంటూ ఎద్దేవా చేస్తున్నారు. మా ఫ్యామిలీ గురించి మాట్లాడితే ఊరుకునేది లేదు' అని చెప్పారు.