Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నందమూరి బాలకష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం 'అఖండ'. అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన భారీ సెట్లో చిత్రీకరించిన చివరి సాంగ్‌తో సినిమా పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శర వేగంగా జరుగుతున్నాయి. అతి త్వరలో విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో బాలకష్ణ, బోయపాటి శ్రీను, మిర్యాల రవీందర్ రెడ్డి, శ్రీధర్ విజయవంతంగా సినిమా పూర్తయిందని సింబాలిక్‌గా చూపిస్తున్నారు.
ఈ సినిమా గురించి మేకర్స్ మాట్లాడుతూ, 'బాలకష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రమిది. ప్రేక్షకుల పల్స్ తెలిసిన దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాలోనూ బాలయ్యను ఇంతకు ముందెన్నడూ చూడని సరికొత్తపాత్రలో చూపించబోతున్నారు. దీంతో ఈ సినిమాపై భారీ క్రేజ్ ఏర్పడింది. డ్యూయల్ రోల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బాలయ్య అఘోరాగా ఓ పాత్రలో అలరించనున్నారు. బాలకష్ణ చేస్తున్న రెండు పాత్రలను పరిచయం చేస్తూ విడుదల చేసిన 'అఖండ ఫస్ట్ రోర్'కి అద్భుతమైన స్పందన లభించింది. అలాగే ఇటీవల విడుదల చేసిన తొలి పాట సంగీత ప్రియులను అమితంగా ఆకట్టుకుంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రంలో బాలకష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటించింది. ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు' అని చెప్పారు. జగపతి బాబు, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మ్యూజిక్ : తమన్, సినిమాటోగ్రాఫర్ : సి. రాంప్రసాద్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు.