Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతున్న చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 15న విడుదలకు సిద్ధమైంది.
సినిమా పూర్తయిన నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం గ్రాండ్‌గా వ్రాప్ అప్ పార్టీ నిర్వహించింది. వినోదాత్మకంగా జరిగిన ఈ పార్టీకి హీరో అఖిల్‌తో పాటు చిత్ర యూనిట్ అంతా హాజరయ్యారు.
ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ, 'వ్రాప్ అప్ పార్టీ ఆద్యంతం వినోదాత్మకంగా సాగింది. జబర్దస్త్ కమెడియన్స్ సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను ఈ కార్యక్రమంలో పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు. ప్రేమ, కెరీర్, పెళ్లి చుట్టూ.. ఉండే అన్ని అంశాలను ముడిపెడుతూ ఎమోషనల్ జర్నీగా దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించారు. ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ముఖ్యంగా మధ్యలో పెళ్లి, పార్ట్నర్ గురించి వచ్చే మాటలు అద్భుతంగా ఉన్నాయి. తన చిత్రాల్లోని పాత్రల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో, లవ్లీగా ఉండేలా దర్శకుడు భాస్కర్ డిజైన్ చేస్తారు. ఈ సినిమాలోనూ అన్ని పాత్రలను అద్భుతంగా డిజైన్ చేశారు. సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుందని, క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు' అని తెలిపింది.