Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
మండల వ్యాప్తంగా పితృ అమావాస్య రోజు బుధవారం మృతి చెందిన తమ కుటుంబ పెద్దలకు బియ్యం ఇచ్చే పండగ పెద్దల పండుగను ఘనంగా నిర్వహించారు. కుటుంబంలో మృతి చెందిన పెద్దల ఆత్మకు శాంతి కలగాలని బ్రాహ్మణునికి ఒక పూట భోజనానికి సరిపడా బియ్యం తో పాటు ఇతర వంట సరుకులు దానంగా ఇస్తున్నందున దీన్ని పిత్రు అమావాస్య అని కూడా అంటారని వేద పండితులు చెబుతున్నారు. దీనిపై ఎవరి నమ్మకం వారిది. ఒక మనిషి తాను సంపాదించిన సంపాదనలు కానీ తనకు ఉన్న దానిలో కానీ మరో వ్యక్తికి సహాయంగా ఇవ్వడం దానంగా ఇవ్వడం అనేది ఒక మంచి లక్షణం అని ఈ పండుగ వల్ల అది అందరిలోనూ రావడం హర్షించదగ్గ విషయం అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రతి గ్రామంలో సుమారు 70 శాతం పైగా ప్రజలు ఈ పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. బియ్యంతో పాటు కొన్ని కూరగాయలు చింతపండు పప్పు వంటి వస్తువులను ఆ గ్రామ బ్రాహ్మణులకు ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని పొందుతారు. ఇది గ్రహించిన వారి పితృదేవతలు సంతోషించడం వల్ల వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని అంతేకాక ఆ ఇంట శుభం జరుగుతుంది అన్నది వారి అభిప్రాయం. తాత ముత్తాతల కాలం నుండి ఈ సాంప్రదాయం గ్రామీణ ప్రాంతాల్లో అనాది నుంచి కొనసాగుతూనే ఉంది. ఎంతో అభివృద్ధి సాధిస్తున్న పట్టుకుని నేటి తరం కూడా ఈ సంప్రదాయాన్ని కొనసాగించడం అభినందించదగ్గ విషయమని పలువురు తెలుపుతున్నారు. ఎంత అభివృద్ధి చెందినా ఎంత పరిజ్ఞానాన్ని సాధించిన అనాదిగా వస్తున్న సాంప్రదాయాలకు గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు యువకులు తెలుపుతున్నారు.