Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'రెమో', 'సీమ రాజా', 'శక్తి' చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం 'వరుణ్ డాక్టర్'. తమిళ సూపర్‌స్టార్ విజరు నటిస్తున్న 'బీస్ట్'కు దర్శకత్వం వహిస్తున్న నెల్సన్ దిలీప్‌కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
గంగ ఎంటర్టైన్మెంట్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్‌తో సంయుక్తంగా కె.జె.ఆర్. స్టూడియోస్ అధినేత కోటపాడి జె.రాజేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయ దశమి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో ఈనెల 9న ఈ సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరో శివ కార్తికేయన్ మీడియాతో సంభాషించారు. ఆ విశేషాలు..
- ప్రతి డాక్టర్ ఆపరేషన్ చేస్తారు. ఈ డాక్టర్ చేసే ఆపరేషన్ చాలా డిఫరెంట్. హీరో పేరు వరుణ్. ఆర్మీ డాక్టర్. సొంతూరుకు వచ్చి ఏం చేశాడు?, ఎందుకు చేశాడు? అనేది కథ. ట్రైలర్లో చూపించినట్టు హ్యూమన్ ట్రాఫికింగ్, ఆర్గాన్ ట్రాఫికింగ్ సినిమాలో ఉన్నాయి. అవి ఎవరు చేశారు?, ఎందుకు చేశారు? అనేది సినిమాలో చూడాలి.
- యాక్షన్, థ్రిల్ మూడ్‌లో సినిమా ఉంటుంది. కానీ, సినిమాలో ఎక్కువ ఫైట్స్ లేవు. అయితే హీరో, విలన్ మధ్య థ్రిల్ మూమెంట్స్ చాలా ఉంటాయి. ఎవరు తెలివైనవారు అనే అంశం మీద ఇద్దరి మధ్య మైండ్ గేమ్ నడుస్తుంది.
- సినిమాలోని ప్రతి పాత్రకు ఓ పర్పస్ ఉంటుంది. నేను తప్ప, వాళ్లందరూ కామెడీ చేస్తారు. నా పాత్ర సీరియస్‌గా ఉంటుంది. ఇందులో ఎటువంటి ఎమోషన్ లేని పాత్ర చేశా. వరుణ్ పాత్ర భావోద్వేగాలను బయటకు చూపించదు. ఎటువంటి ఎమోషన్ లేకుండా నటించడం చాలా కష్టం. ఈ సినిమాలో నాకు ఎదురైన ఛాలెంజ్ అదే.
- ఇందులో లవ్ ఎపిసోడ్ పెద్దగా ఉండదు. హీరో, హీరోయిన్ మధ్య బ్రేకప్‌తో సినిమా ఆరంభమవుతుంది. ప్రియాంకా అరుల్ మోహన్ అద్భుతంగా నటించింది. తమిళ వెర్షన్లో రెండు పాటలను నేనే రాశాను. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ నా క్లోజ్ ఫ్రెండ్. తనపై నాకున్న నమ్మకమే ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడానికి కారణం. సినిమా ఫస్ట్ కాపీ వరకూ ప్రొడ్యూస్ చేయడం నా పని. ఆ తర్వాత మొత్తం విడుదల వ్యవహారాలు కె.జె.ఆర్ స్టూడియోస్ అధినేత కోటపాడి రాజేష్ చూస్తారు. రాజేష్ అందిస్తున్న సపోర్ట్‌కి హ్యాట్సాఫ్. త్వరలోనే స్ట్రయిట్ తెలుగు సినిమా చేయబోతున్నా. దీని వివరాలు నిర్మాతలే అధికారికంగా ప్రకటిస్తారు.