Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ కూచిపూడి డాన్సర్ సంధ్యారాజు నటిగా, నిర్మాతగా పరిచయం అవుతూ నిర్మించిన చిత్రం 'నాట్యం'. రేవంత్ కోరుకొండ దర్శకుడు. నిశ్రింకళ ఫిల్మ్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ఈనెలలోనే విడుదలకు సిద్ధమైంది. తాజాగా ఈ చిత్రంలోని 'వేణువులో చేరని గాలికి సంగీతం లేదు..' అంటూ సాగే పల్లవిగల పాటను అగ్ర కథానాయకుడు రవితేజ విడుదల చేసి, యూనిట్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ, ''నాట్యం' అంటే ఓ కథను డాన్స్ ద్వారా అందమైన రూపంలో చెప్పడమే. అలాంటి ఓ అద్భుతమైన కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రమిది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్, సాంగ్స్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాలోని 'వేణువులో చేరని గాలికి సంగీతం లేదు' అనే విడుదలై, మంచి ఆదరణ పొందుతోంది. కరుణాకర్ అడిగర్ల అద్భుతమైన సాహిత్యం అందించిన ఈ పాటకు శ్రవణ్ భరద్వాజ్ అదే స్థాయిలో ట్యూన్ కంపోజ్ చేశారు. అనురాగ్ కులకర్ణి శ్రావ్యంగా ఆలపించిన ఈ పాట శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని ఈనెల 22న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు' అని అన్నారు.