Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గోపీచంద్, నయనతార హీరో, హీరోయిన్లుగా బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఆరడుగుల బుల్లెట్'. జయ బాలాజీ రియల్ మీడియా బ్యానర్‌పై తాండ్ర రమేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 8న ఈ చిత్రం భారీ స్థాయిలో థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా దర్శకుడు బి.గోపాల్ బుధవారం మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
ఇది పక్కా కమర్షియల్ సినిమా. తండ్రీ కొడుకుల మధ్య జరిగే కథ. ఆకతాయి కొడుకుని తండ్రి దూరంగా పెట్టడం, ఆ కుటుంబం కష్టాల్లో ఉంటే, ఆ కొడుకే వచ్చి కాపాడ్డం, ఈ క్రమంలో కొడుకును ఆ తండ్రి ఎంతలా అపార్థం చేసుకున్నాడు?, ఎంతలా మిస్ అయ్యాడు?,
ఆ ఫ్యామిలీని కొడుకు ఎలా కాపాడాడు అనేదే ఈ కథ. ఫాదర్ అండ్ సన్ రిలేషన్, నయనతారతో లవ్ స్టోరీ, విలన్స్‌తో క్లాష్ హై ఓల్టేజ్‌గా ఉంటుంది. గోపీచంద్‌కు సరైన స్క్రిప్ట్ ఇది. వక్కంతం వంశీ కథ, అబ్బూరి రవి మాటలు అందర్నీ మెప్పిస్తాయి. మణిశర్మగారు ఇచ్చిన మ్యూజిక్ చాలా బాగుంది. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ సినిమాతో జనంలోకి రావడం ఆనందంగా ఉంది. నేను చేసింది 35 సినిమాలే. ఈ పాటికే వందల సినిమాలు చేయొచ్చు.
కానీ నాకు కథ, స్క్రిప్ట్ నచ్చితేనే చేస్తాను. కథ నచ్చితేనే సినిమాకి న్యాయం చేయగలుగుతా. నేను చేసిన సినిమాలేవీ కూడా నా కథలు కాదు. సీనియర్ రచయితలు, కొత్త రచయితలు రాసిన కథలు. 'మస్కా' సినిమాతో సూర్యని, చిన్ని కష్ణను కూడా నేనే పరిచయం చేశా. స్క్రిప్ట్ బాగుంటే, సూపర్ హిట్ అవుతుంది. లేదంటే ఫ్లాప్ అవుతుంది. 'క్రాక్' జనాలకు నచ్చింది. కాబట్టే సూపర్ హిట్ అయింది. నాకు రీమేక్‌లు చేయటం పెద్దగా నచ్చదు.
అయితే కొన్ని ఆబ్లిగేషన్ల వల్ల 'అసెంబ్లీ రౌడీ', 'బ్రహ్మ' చేశాను. నాకెప్పుడూ కొత్త కథలతోనే సినిమాలు చేయడం ఇష్టం. నా సినిమా అంటే పాటలు, ఫైట్లు కచ్చితంగా ఉంటాయి. కానీ వీటిని కచ్చితంగా సందర్భాన్ని బట్టే పెడతాను. ఇప్పుడు ఓటీటీ కంటెంట్లను కూడా ప్రేక్షకులు బాగానే చూస్తున్నారు. అయితే నాకు మాత్రం థియేటర్లోనే సినిమా చూడటం ఇష్టం. నేనే కాదు వెండితెరపై సినిమా చూడ్డానికి జనాలూ బాగా ఇష్టపడతారు' అని తెలిపారు.