Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శివ కార్తికేయన్ హీరోగా నటించిన తాజా చిత్రం 'వరుణ్ డాక్టర్'. నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించిన చిత్రమిది. గంగ ఎంటర్టైన్మెంట్స్, ఎస్.కె. ప్రొడక్షన్స్‌తో సంయుక్తంగా కె.జె.ఆర్. స్టూడియోస్ అధినేత కోటపాడి జె. రాజేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయదశమి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో ఈనెల 9న ఈ సినిమా విడుదలవుతోంది.
ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించింది. ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా హాజరైన నిర్మాతలు ఏసియన్ సునీల్, సుధాకర్ రెడ్డి, 'ఠాగూర్' మధు ఈ చిత్ర బిగ్ టికెట్‌ను ఆవిష్కరించి, సినిమా భారీ విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా హీరో శివ కార్తికేయన్ మాట్లాడుతూ, 'ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. ఈ సినిమాలో డాక్టర్ వరుణ్ పాత్రలో నటించా. నాకు ఈ క్యారెక్టర్ చాలా కొత్త. కంటెంట్ బావుంటే ప్రేక్షకులు ఆదరిస్తారు. సినిమాకు ఎల్లలు లేవు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది' అని చెప్పారు. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ, 'సినిమాలో చాలా ఎంటర్టైన్మెంట్, ఫన్ ఉంది. మా డాక్టర్ మంచోడా? చెడ్డోడా? వంటి ప్రశ్నలకు 9న థియేటర్లలో ఆన్సర్ లభిస్తుంది' అని తెలిపారు. గంగ ఎంటర్టైన్మెంట్స్ అధినేత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, 'పాటలు, ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై అంచనాలు పెంచాయి. ఆ అంచనాలను అందుకునే విధంగా ఈ సినిమా ఉంటుంది' అని చెప్పారు. హీరోయిన్ ప్రియాంకా అరుల్ మోహన్ మాట్లాడుతూ, 'ఈ సినిమా నాకు చాలా చాలా స్పెషల్. రెగ్యులర్ సినిమాలా ఉండదు. కథ, క్యారెక్టర్లు అన్నీ కొత్తగా ఉంటాయి' అని తెలిపారు.