Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పద్మజ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై రామ్ అగ్నివేశ్ హీరోగా తొలి ప్రయత్నం గా నిర్మించిన 'ఇక్షు' చిత్రానికి దర్శకత్వం వహించిన వి.వి.రుషిక దర్శకత్వంలోనే నిర్మాత హనుమంత రావు నాయుడు ప్రొడక్షన్ 2గా మరో చిత్రాన్ని గురువారం అన్నపూర్ణ స్టూడియోలో పూజతో ప్రారంభించారు. ఈ సందర్బంగా చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు 'ఎంఎల్ఏ' ఫేమ్ దర్శకుడు ఉపేంద్ర క్లాప్ ఇవ్వగా, నిర్మాత డి.ఎస్.రావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి షాట్‌కు చిత్ర దర్శకురాలు రుషిక గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా సహ నిర్మాత సాయి కార్తీక్ మాట్లాడుతూ, 'ఇదొక మిడిల్ క్లాస్ జీవితాలలో జరిగే కథ. ముఖ్యంగా తండ్రి, కొడుకు నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ని దసరా తరువాత ప్రారంభిస్తాం' అని తెలిపారు. 'మేం నిర్మించిన మొదటి సినిమా 'ఇక్షు' చిత్రాన్ని తెరకెక్కించిన విధానం బాగా నచ్చడంతో అదే దర్శకురాలితో, అదే హీరో రామ్ అగ్నివేశ్‌తో రెండో సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా ఇది' అని నిర్మాత అన్నారు. దర్శకురాలు మాట్లాడుతూ, 'పేరెంట్స్, పిల్లల మధ్య జరిగే సన్నివేశాలతో ఉండే ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుంది' అని చెప్పారు.