Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈనెల 10వ తేదీన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు జరుగనున్న విషయం విదితమే. దాదాపు 900 మంది కళాకారులు ఈ ఎన్నికల్లో ఓటు హక్కుని వినియోగించుకోవాల్సి ఉంది. దీంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్ అధికారి వి.కృష్ణమోహన్ అభ్యర్థన మేరకు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తరఫున గౌరవ కార్యదర్శులు టి.ప్రసన్నకుమార్, మోహన్ వడ్లపట్ల సభ్యులందరికీ ప్రకటన రూపంలో ఓ విజ్ఞప్తి చేశారు. సభ్యులు ఎవరైనా సరే మధ్యాహ్నం 2 గంటల్లోపు ఓటు హక్కుని వినియోగించుకున్న తర్వాతే, షూటింగ్‌లకు హాజరు కావాలి. ఈ విషయమై నిర్మాతలకు కూడా సమాచారం అందించామని వారు ఆ ప్రకటనలో తెలిపారు. ఇక 'మా' అధ్యక్ష పదవి కోసం ప్రకాష్‌రాజ్, మంచు విష్ణు బరిలోకి దిగారు. వీరిద్దరిలో ఎవరు 'మా' అధ్యక్ష పీఠాన్ని దక్కించుకుంటారనే ఆత్రుత సర్వత్రా ఉంది.