Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాన్ ఇండియా స్టార్‌గా అటు అభిమానులు, ఇటు పరిశ్రమ వర్గాలు సైతం అభివర్ణిస్తున్న కథానాయకుడు ప్రభాస్. ప్రస్తుతం 'రాధేశ్యామ్', 'ఆది పురుష్', 'సలార్', 'ప్రాజెక్ట్ కె' వంటి పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ప్రభాస్ లేటెస్ట్గా మరో పాన్ ఇండియా చిత్రానికి పచ్చజెండా ఊపారు. ఇది ఆయన నటించబోయే 25వ సినిమా కావడం విశేషం. చిత్ర బృందం గురువారం ఈ సినిమాని ఎనౌన్స్ చేసింది.సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేయబోయే ఈ చిత్రాన్ని 'స్పిరిట్' అనే ఆసక్తికరమైన టైటిల్‌ని కూడా ఖరారు చేశారు. టీ సిరీస్, భద్రకాళీ పిక్చర్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
''అర్జున్ రెడ్డి'తో సంచలనం సష్టించిన సందీప్ రెడ్డి ఆ తర్వాత అదే సినిమాను హిందీలో షాహిద్ కపూర్ హీరోగా 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేసి, అక్కడా సంచలన విజయం అందుకున్నారు. ఇప్పటి వరకు ప్రభాస్‌ను అభిమానులు, ప్రేక్షకులు కనీసం ఊహించనటు వంటి కొత్త పాత్రలో సందీప్ రెడ్డి వంగా చూపించబోతున్నారు. టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మాతగా పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రాబోతుంది. 10 భారతీయ భాషల్లో తెరకెక్కబోయే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే మేకర్స్ వెల్లడించనున్నారు' అని చిత్ర బృందం పేర్కొంది.