Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భానుశ్రీ, సంతోష్ రాజ్ జంటగా శ్రీనివాస్ కౌశిక్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'క్లిక్'. శుక్లాం బరధరం సినీ క్రియేషన్స్ పతాకం పై బి. ఎల్ బాబు నిర్మించిన యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రమిది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనివాస్ కౌశిక్ మాట్లాడుతూ, 'ప్రతి రెండు నిమిషాలకు ఒక రేప్ జరుగుతుంది. కొందరు కీచకులు ఆడవాళ్ళని చాలా నీచంగా చూస్తున్నారు. ప్రస్తుత సమాజంలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. భానుశ్రీ అద్భుతంగా నటించింది. మంచి యాక్షన్ ఎపిసోడ్స్‌తో, అద్భుతమైన కథాకథనంతో ఉన్న మా చిత్రాన్ని సెన్సార్ సభ్యులు విజయశాంతి 'ప్రతిఘటన' చిత్రంతో పోల్చడం చాలా ఆనందంగా ఉంది. మా చిత్రాన్ని ఈనెల 22న విడుదల చేస్తున్నాం' అని తెలిపారు. 'దర్శకుడు చెప్పిన కథ చాలా బాగుంది. సినిమా చాలా బాగా వచ్చింది. సెన్సార్ సభ్యులు కూడా చాలా కాలం తర్వాత అద్భుతమైన చిత్రం చూశామని ప్రశంసించారు. భానుశ్రీ నటన అద్భుతంగా ఉంటుంది. సీనియర్ నటుడు భాను చందర్, జెమినీ సురేష్, శరత్ లోహితాశ్వా, పద్మజ లంక మంచి క్యారెక్టర్లు చేశారు. సతీష్ బాబు సంగీతం సినిమాకి హైలైట్‌గా ఉంటుంది. ఇలాంటి చిత్రాన్ని నిర్మించినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నా. అందరికీ నచ్చే సినిమా ఇది. కచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది' అని నిర్మాత బి.ఎల్.బాబు చెప్పారు.