Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శివ కందుకూరి హీరోగా నటించిన తాజా చిత్రం 'మను చరిత్ర'. లవ్ అండ్ వార్ కాన్సెప్ట్‌తో రూపొందు తున్న ఈ సినిమాను ప్రొద్దుటూరు టాకీస్ పతాకంపై నారల శ్రీనివాస రెడ్డి నిర్మిస్తున్నారు. భరత్ పెదగాని దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా 'మను చరిత్ర' ప్రీ ఫేస్ పేరుతో టీజర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు భరత్ మాట్లాడుతూ, 'సిగరెట్, ఆల్కహాల్, డ్రగ్స్ మత్తు కొంతసేపే ఉంటుంది. కానీ 'మనుచరిత్ర' మాత్రం ఎప్పటికీ నిలిచిపోతుంది' అని చెప్పారు. 'సినిమాని చూపించినట్టుగానే మూడు గంటల పాటు డైరెక్టర్ భరత్ నెరేషన్ ఇచ్చారు. ఈ సినిమాకు కథే బలం అవుతుందని అనిపించి, సినిమా స్టార్ట్ చేశాం' అని నిర్మాత శ్రీనివాసరెడ్డి తెలిపారు.
హీరో శివ కందుకూరి మాట్లాడుతూ,'ప్రతీ ఒక్క నటుడు తన కెరీర్లో ఓ మంచి సినిమా చేయాలనుకుంటారు. నాకు అలాంటి సినిమానే 'మనుచరిత్ర'. చాలా కష్టపడి, ఎంతో నిజాయితీతో ఈ చిత్రాన్ని చేశాం. మా ప్రీ ఫేస్ మీకు (ప్రేక్షకులు) నచ్చిందని భావిస్తున్నాను' అని చెప్పారు.
'ఇంటెన్స్ లవ్ స్టోరీలతో వచ్చిన చిత్రాలు కచ్చితంగా హిట్ అవుతాయి. అలాగే ఇది కూడా హిట్ అవుతుంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌కు తగ్గట్టుగా భరత్ కథ రాసుకున్నాడు. ఈ సినిమాకి అతి పెద్ద బలం గోపీ సుందర్. అద్బుతమైన సంగీతాన్ని అందించారు' అని రాజ్ కందుకూరి తెలిపారు.