Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆనంద్ దేవరకొండ హీరోగా సినిమా టోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకత్వంలో రూపొందుతున్న సైకో క్రైమ్ థ్రిల్లర్ 'హైవే'. మానస రాధాకష్ణన్ కథానాయిక. శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.2గా నిర్మాత వెంకట్ తలారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వెంకట్ తలారి మాట్లాడుతూ, 'ఇదొక డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్. '118' వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన గుహన్‌గారు ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా ఎనౌన్స్ చేసినప్పటి నుండి పాజిటివ్ వైబ్స్ బాగా వచ్చాయి. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో జరిపిన షూటింగ్‌తో సినిమా పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఏకధాటిగా జరుగుతోంది' అని చెప్పారు.
''హైవే' నేపథ్యంలో సాగే ఒక సైకో క్రైమ్ థ్రిల్లర్ ఇది. టెక్నికల్‌గా చాలా అడ్వాన్డ్స్‌గా ఉంటుంది. ప్రతిక్షణం ట్విస్టులు, టర్న్‌లతో ఆసక్తికరంగా ఉంటుంది' అని దర్శకుడు గుహన్ అన్నారు.