Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లెజెండరీ డైరెక్టర్ కోడిరామకష్ణ పెద్దకుమార్తె కోడి దివ్యదీప్తి తన తండ్రి స్ఫూర్తితో ఓ కొత్త చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కోడి రామకష్ణ ప్రెజెంట్స్‌లో కోడి దివ్య ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై కిరణ్ అబ్బవరం, సంజన ఆనంద్ జంటగాఈ సినిమా రూపొంద నుంది. కార్తీక్ శంకర్ దర్శకుడు. శుక్రవారం సినీ అతిథుల సమక్షంలో అన్నపూర్ణ స్టూడియోలో పూజ కార్యక్రమాలతో ఘనంగా ఈ సినిమా ప్రారంభమైంది.
హీరో, హీరోయిన్‌పై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు నిర్మాత రామలింగేశ్వర రావు క్లాప్ నివ్వగా, ప్రముఖ దర్శకుడు ఎ.ఎం.రత్నం స్విచాన్ చేశారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత కోడిదివ్య మాట్లాడుతూ, 'నాన్నగారి (కోడిరామకృష్ణ) స్ఫూర్తితో ఓ మంచి సినిమా నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ఈ సినిమాతో నిర్మాతగా తొలి అడుగు వేస్తున్నాను' అని చెప్పారు. 'నా తొలి చిత్రాన్ని లెజెండరీ డైరెక్టర్ కోడి రామకష్ణ గారి బ్యానర్లో చేయటం చాలా సంతోషంగా ఉంది' అని దర్శకుడు కార్తీక్ శంకర్ అన్నారు.
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ, 'కోడి రామకష్ణ గారి దీవెనలతో, చాలా మంది పెద్దల ఆశీస్సులతో మా మూవీ స్టార్ట్ ఆయినందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ ప్రొడక్షన్ సొంత ప్రొడక్షన్ లాంటిది. దీప్తి మొదటినుంచి నన్ను ఇంట్లో మనిషిలా చూసుకుంటారు. మణిశర్మ గారి మ్యూజిక్ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. ఆయన ఈ సినిమాకు మ్యూజిక్ చేయడం చాలా సంతోషంగా ఉంది. కార్తీక్ శంకర్ చాలా మంచి స్క్రిప్ట్ రాసుకున్నాడు. ఇది చక్కటి కుటుంబ కథా చిత్రం. ఈ సినిమా ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది. ఈ నెలలోనే షూటింగ్ స్టార్ట్ అవుతుంది' అని తెలిపారు. 'గొప్ప బ్యానర్లో మంచి టీమ్‌తో చేస్తున్న సినిమాలో హీరోయిన్గా నటించడం అదృష్టంగా భావిస్తున్నా' అని కథానాయిక సంజన ఆనంద్ అన్నారు. ఈ చిత్రానికి నిర్మాత : కోడి దివ్య దీప్తి, నరేష్ రెడ్డి ములె, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : భరత్ రొంగలి, కెమెరామెన్ : రాజ్ కె నల్లి, లిరిక్స్ : భాస్కర్ పట్ల, ఎడిటర్ : విప్లవ్ నైషదం, ఆర్ట్ : రవి బాబు, స్టోరీ- స్క్రీన్ ప్లే - డైరెక్షన్ : కార్తీక్ శంకర్.