Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిఖిల్ హీరోగా నటిస్తున్న 19వ చిత్రానికి గ్యారీ బీహెచ్ (గూఢచారి, ఎవరు, హిట్ చిత్రాలకు ఎడిటర్) దర్శకత్వం వహిస్తున్నారు. రెడ్ సినిమాస్ పతాకంపై కె. రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
చరణ్ తేజ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా శుక్రవారం పూజతో లాంఛనంగా ప్రారంభమైంది. నిర్మాతలు శరత్ మరార్, జెమినీ కిరణ్, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ముఖ్య అతిథులుగా హాజరై, స్క్రిప్ట్‌ను చిత్రయూనిట్‌కు అందించారు. ముహుర్తం షాట్‌కు గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించగా, నిర్మాత రాజశేఖర్ రెడ్డి క్లాప్ కొట్టారు. నిర్మాత కొడుకు, కూతురు ఈశన్వి, ధవ్ కెమెరా స్విచాన్ చేశారు. ఐశ్వర్యా మీనన్ హీరోయిన్గా నటిస్తున్న ఇందులో నిఖిల్ తొలిసారి స్పైగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి రచయిత : అనిరుధ్ కష్ణమూర్తి, సంగీతం : శ్రీచరణ్ పాకాల, సినిమాటోగ్రఫీ : మనోజ్ రెడ్డి, ఆర్ట్ డైరెక్టర్ : అర్జున్ సురిశెట్టి, ప్రొడక్షన్ డిజైనర్ : రవి ఆంటోని.