Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శర్వానంద్, సిద్ధార్థ్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రం 'మహా సముద్రం'. 'ఆర్ ఎక్స్ 100' ఫేమ్ అజరు భూపతి దర్శకత్వంలో ఎ.కె.ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటిస్తున్నారు. దసరా కానుకగా ఈనెల14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ సందర్భంగా కథానాయకుడు సిద్ధార్థ్ శుక్రవారం మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
అజరు భూపతి డైరెక్ట్ చేసిన 'ఆర్ ఎక్స్ 100' చూశా. చాలా పర్ఫెక్షన్తో తీశాడు. తను 'మహాసముద్రం' కథ చెబుతుంటే, రెండో సినిమా దర్శకుడిలా అనిపించలేదు. కథ నాకు చాలా బాగా నచ్చింది. ఇది ట్రెండ్ సెట్టర్ సినిమా అవుతుందనే గట్టి నమ్మకంతో గ్రీన్‌సిగల్ ఇచ్చా.
శర్వానంద్ అద్భుతమైన నటుడు. మేం ఇద్దరం కలిసి ఓ సినిమా చేస్తున్నామంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వారికి తగిన కారణాలు ఉంటాయి. మేమిద్దం ఒక్కసారి కూడా అలా చేద్దాం.. ఇలా చేద్దాం అని డిస్కస్ చేయలేదు. ఎందుకంటే స్క్రిప్ట్ మీద మాకు అంత నమ్మకం ఉంది. ఇందులో అద్భుతమైన ప్రేమ కథ ఉంటుంది. 'మహా' అనేది హీరోయిన్ పేరు. అది ఎవరు? అనేది సినిమాలో తెలుస్తుంది. ఫీమేల్ క్యారెక్టర్స్‌ని
దర్శకుడు అజరు అద్భుతంగా రాశారు. ఈ సినిమాలో నా లుక్, గెటప్ బాగుందని ప్రశంసలు రావడానికి కారణం మా మేకప్ ఆర్టిస్ట్ శివగారు. చాలా మంది దర్శకులు తమ సినిమా ఏంటో అర్థమయ్యేలా ట్రైలర్‌ని కట్ చేస్తారు. కాని మా దర్శకుడు అజరు భూపతి మాత్రం ట్రైలర్‌ను అద్భుతంగా కట్ చేశారు. ట్రైలర్ బాగుంది. కానీ కథ ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు అని చూసిన ప్రతీ ఒక్కరూ అడిగారు. అదే మా సక్సెస్ అని ఫీలవుతున్నా. నన్ను స్టార్‌ని చేసింది తెలుగు వాళ్లే. అయితే ప్రతీ భాషల్లో నాకు ఓ ఐకానిక్ చిత్రం ఉంది. తమిళంలో 'బార్సు', హిందీలో 'రంగ్ దే బసంతి'.. ఇలా ఉన్నాయి. అయితే ప్రతీ చోటా నేను తెలుగు నటుడ్ని అని చెప్పుకునేవాడిని. దాంతో అక్కడి వాళ్ళు హర్ట్ అయ్యేవారు. కానీ నేను తెలుగు స్టార్‌ని, భారతీయ నటుడిని. అందుకే మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకున్నాను. ఇకపై తెలుగు ప్రేక్షకులను వదిలిపెట్టి వెళ్లను. ప్రస్తుతం తెలుగులో రెండు ప్రాజెక్ట్‌లున్నాయి. నేను 'మా'లో లైఫ్ టైం మెంబర్ని. అందరి మాటలు విని.. నా మనసు చెప్పినవారికే 'మా' ఎన్నికల్లో ఓటు వేస్తాను.
శర్వానంద్ చెప్పినట్టు ఇది షూర్ షాట్ బ్లాక్ బస్టర్. ఇందులోని పాత్రలో నన్ను ఊహించుకున్నందుకు, పాత్రను నాకు ఇచ్చినందుకు అజరుకి థ్యాంక్స్. ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు నాకు చాక్లెట్ బారు, లవర్ బారు అనే ఇమేజ్ ఇచ్చారు. కానీ ఈ సినిమాతో కొత్త రకమైన ఇమేజ్ వస్తుంది. కచ్చితంగా నాకు కమ్ బ్యాక్ సినిమా అవుతుంది.