Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీనియర్ నటుడు సత్యరాజ్ తనయుడు శిబి సత్యరాజ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'మాయోన్'. కిషోర్ ఎన్ దర్శకుడు. డబుల్ మీనింగ్ ప్రొడక్షన్ పతాకంపై అరుణ్ మొళి మాణికం ఈ చిత్రాన్ని నిర్మించడటంతోపాటు స్క్రీన్ ప్లే కూడా అందించారు. టీజర్ విడుదలైన సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ, 'విజువల్ వండర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌కి అన్ని చోట్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా ఉండటంతో అందర్నీ విశేషంగా అలరిస్తోంది. ఓ పురాతన దేవాలయం చుట్టూ తిరిగే కథ అని ఈ టీజర్ చెప్పకనే చెబుతోంది. ఆ పురాతన దేవాలయంలో ఏముంది?, హీరో బృందం ఆ దేవాలయాన్ని ఎందుకు రీసెర్చ్ చేయాలనుకుంది వంటి తదితర అంశాలు ప్రేక్షకుల్ని సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టేలా ఉంటాయి. సీనియర్ నటుడు సత్యరాజ్ తనయుడు శిబి సత్యరాజ్ నటన ఈ చిత్రంలో ఎంతో వైవిధ్యంగా ఉంటుంది. మైథలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రానికి ఇళయరాజా స్వరపర్చిన పాటలతోపాటు నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. అలాగే ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు, మరెన్నో ఆసక్తికర విశేషాలూ ఉన్నాయి. వీటితోపాటు సినిమా విడుదల తేదీ గురించి మేకర్స్ త్వరలోనే వెల్లడిస్తారు' అని తెలిపింది. శిబి సత్యరాజ్, తాన్య రవిచంద్రన్, రాధా రవి, కె.ఎస్.రవికుమార్, భగవతి పెరుమా, హరీష్ పేరడీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు: కిశోర్ . ఎన్, నిర్మాత: అరుణ్ మొళి మాణికం, కెమెరా : రామ్ ప్రసాద్, ఎడిటర్: రామ్ పాండ్యన్ - కొండల రావు, సంగీతం : ఇళయరాజా.