Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అగ్ర దర్శకుడు వి.వి.వినాయక్ బర్త్‌డే వేడుక శనివారం బీఎస్ఎస్9 సెట్లో గ్రాండ్‌గా జరిగింది. నిర్మాత, వైజాగ్ ఎంపీ ఎంవీవీ సత్య నారాయణ, నిర్మాత బెల్లంకొండ సురేష్ తదితరులు పాల్గొని వినాయక్‌కి శుభాకాంక్షలు తెలిపారు.
హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, వి.వి.వినాయక్ కాంబినేషన్లో 'ఛత్రపతి' హిందీ రీమేక్ జరుగుతున్న విషయం తెలిసిందే. పెన్ స్టూడియోస్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వైజాగ్‌లో ఏకధాటిగా జరుగుతోంది.