Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మనుషుల మధ్య ఉండే అనుబంధాల్ని, భావోద్వేగాల్ని దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ బాగా డీల్ చేస్తారు. ట్రైలర్ చూస్తుంటే ఓ వేడుకలా అనిపించింది. ఈ సమయంలో థియేటర్లలో ఇలాంటి ఓ వేడుకే కావాలి. అది 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' సినిమా కచ్చితంగా భర్తీ చేస్తుందని నమ్ముతున్నా' అని హీరో నాగ చైతన్య అన్నారు.
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు, వాసువర్మ సంయుక్తంగా జీఎ2 పిక్చర్స్ పతాకంపై నిర్మించారు. ఈ సినిమా ఈనెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం అత్యంత వైభవంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో నాగచైతన్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ, 'మేమందరం ఓ మంచి సినిమా తీశామని గర్వంగా చెబుతున్నా. భాస్కర్ కథలు, సినిమాలు నాకు చాలా ఇష్టం. కోవిడ్ పరిస్థితుల తర్వాత థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా? రారా? అనే సందిగ్ధంలో ఉన్నప్పుడు 'లవ్‌స్టోరి' విడుదలై, అందరికీ ఓ నమ్మకాన్ని ఇచ్చింది. ఆ నమ్మకంతోనే మా చిత్రాన్ని ఈనెల 15న థియేటర్లలో విడుదల చేస్తున్నాం. వంద శాతం ఆక్యూపెన్సీ వస్తుందని ఆశిస్తున్నా. కచ్చితంగా పూర్వ వైభవాన్ని మళ్ళీ చూస్తాం. ఫ్యామిలీతో కలిసి థియేటర్లకు రండి.. నవ్వుల థెరపీని అనుభూతి చెందండి' అని చెప్పారు. 'కోపం నుంచి ఈ కథ పుట్టింది. ఈలోకం చాలా మంది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్స్ని తయారు చేస్తోంది. అయితే వీళ్ళలో ఉన్న ఓ చిన్న విషయం ఎవరూ ఎవరికి నేర్పించడం లేదు. ఆ విషయం ఏంటి అనేదే ఈ సినిమా. ఇది అందరికీ ఉపయోగపడుతుందని భావిస్తున్నా. అలాగే అఖిల్‌ని అన్ని వర్గాల ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళాలన్న మోటోతో ఈ సినిమా చేశా. అఖిల్ నటనలోని కొత్త కోణాన్ని, ఓ ఫ్రెష్ యాంగిల్‌ని చూస్తారు. విభాగా పూజా అద్భుతంగా నటించింది' అని దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ అన్నారు. నాయిక పూజా హెగ్డే మాట్లాడుతూ, 'ఈ సినిమా నాకెంతో స్పెషల్. ఇందులో 'విభా' క్యారెక్టర్లో నటించే ఛాన్స్ ఇచ్చిన దర్శకుడు భాస్కర్‌కి థ్యాంక్స్. నా పాత్రలో చాలా షేడ్స్ ఉంటాయి' అని తెలిపింది.
'ఈ సినిమాతో నా కెరీర్లో ఓ మంచి సినిమా తీశానని గర్వంగా చెప్పుకోగలను. క్లయిమాక్స్ చూస్తున్నప్పుడు కన్నీటి పర్యంత మయ్యాను. ఇదంతా దర్శకుడు భాస్కర్ కథని, సంభాషణలు రాసుకున్న తీరు వల్లే సాధ్యమైంది' అని నిర్మాత బన్నీవాసు చెప్పారు. '
'నేను నిర్మాతగా మారటానికి కారణం బన్నీవాసు. ఓ మంచి సినిమాలో భాగస్వామిని చేసినందుకు వాసుకి థ్యాంక్స్. అరవింద్‌గారి ప్రోత్సాహం మరువలేనిది' అని మరో నిర్మాత వాసువర్మ అన్నారు.
'ఈ సినిమా విజువల్‌గా, మ్యూజికల్‌గా అద్భుతంగా ఉంటుంది. భాస్కర్ దర్శకత్వం, బన్నీవాసు నిర్మాణ పనితీరు చాలా బాగుంది. అఖిల్ హానెస్ట్ ఫెర్మామెన్స్, పూజా నటన అందర్నీ అలరిస్తుంది' అని అల్లు అరవింద్ చెప్పారు.
ఓ సినిమా రిజల్ట్ కన్నా, ఆ సినిమా కోసం సిద్ధమయ్యే ప్రిపరేషన్ని అఖిల్ ఎంతో ప్రేమిస్తాడు. తనలో నాకు బాగా నచ్చే లక్షణం అదే. తను కెరీర్‌ని స్టార్ట్ చేసి నాలుగేండ్లు అవుతోంది. రోజూ ఇంట్లో ఓ కొత్త అఖిల్‌ని చూస్తుంటా. ఎలాంటి పాత్రలు పోషించాలి, ఎలాంటి సినిమాల్లో నటించాలనే విషయాల్లో అఖిల్ చాలా క్లియర్‌గా ఉన్నాడు. డిఫరెంట్ కథలతో అందర్నీ కచ్చితంగా అలరిస్తాడు.
- నాగ చైతన్య