Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజ్ తరుణ్, సందీప్ మాధవ్, సిమ్రత్, సంపద హీరో,హీరోయిన్లుగా సి.హెచ్.సుధీర్ రాజు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'మాస్ మహారాజు'. స్టార్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై ఎం.అసిఫ్ జానీ నిర్మిస్తున్నారు.
ఈ చిత్ర పూజ కార్యక్రమాలు రామానాయుడు స్టూడియోలో సినీ అతిథుల సమక్షంలో ఘనంగా జరిగాయి. హీరో, హీరోయిన్‌పై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు దర్శకుడు వీరశంకర్ క్లాప్ నివ్వగా, జెమిని కిరణ్ స్విచ్ఛాన్ చేశారు. నిర్మాత సి.కళ్యాణ్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, 'మన కోసం సూర్యచంద్రులు ఒకరి కోసం మరొకరు ఎలా వస్తూ, వెళ్తున్నారో ఈ సినిమాలో వీరిద్దరూ ఒకరి కోసం, మరొకరు ఏం త్యాగం చేశారన్నదే కథ. స్నేహం నేపథ్యంలో సాగే మంచి కంటెంట్‌తో వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది' అని చెప్పారు.
'స్నేహం నేపథ్యంలో ఇప్పటివరకు ఎన్నో సినిమాలొచ్చాయి. వాటికి భిన్నంగా ఫ్రెష్ కంటెంట్‌తో ఈ సినిమా ఉంటుంది' అని నిర్మాత తెలిపారు. రాజా రవీంద్ర, సాయి కుమార్, సత్యం రాజేష్, ధనరాజ్, రచ్చరవి, చంటి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ : మణి శర్మ, సినిమాటోగ్రఫీ : అజయన్ విన్సెంట్, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, ఆర్ట్ డైరెక్టర్ : ఎస్. హరిబాబు, ఫైట్స్ : జోషువా.